Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Latest Announcement: District wise by Red zone

తాజా ప్రకటన : ఏపీలో జిల్లాల వారీగా రెడ్‌జోన్ ప్రాంతాలివే


ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్పా తగ్గడం లేదు. అయితే తాజాగా ఏపీలో నేడు ఒక్కరోజే 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2205కి చేరింది. అయితే గుంటూర్ జిల్లాలో 9 కేసులు, కర్నూల్ జిల్లాలో 9, నెల్లూరులో 9, చిత్తూరులో 8, కృష్ణాలో 7, విశాఖలో 4, కడప, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 803 యాక్టివ్ కేసులు ఉండగా, 1353 మంది కరోన నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక మరణాల సంఖ్య 49 గా ఉంది. అయితే ఏపీలోని ప్రకాశం జిల్లా కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. ఈ జిల్లాలో మొత్తం 63 కేసులు నమోదు కాగా వారంతా కోలుకుని పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయారు.
అంతేకాదు గత కొద్ది రోజుల నుంచి ఈ జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కావడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్‌జోన్‌లో ఉన్న ప్రాంతాల వివరాలను వెల్లడించింది.
  • నెల్లూరు జిల్లా: నెల్లూరు టౌన్, నాయుడుపేట, వాకాడు, సూళ్ళురుపేట, తడ ప్రాంతాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి.
  • ప్రకాశం జిల్లా: కారంచేడు, చీరాల, ఒంగోలు టౌన్, గుడ్లూరు ప్రాంతాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి.
  • కృష్ణా జిల్లా: జగ్గయపేట, విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, పెనమలూరు, మచిలీపట్నం, నూజీవీడు, ముసునూరు ప్రాంతాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి.
  • కర్నూల్ జిల్లా: ఆదోని, చిప్పగిరి, ఆస్పరి, తుగ్గలి, ఆత్మకూరు, కోడుమూరు, కర్నూలు టౌన్, నందికొట్కూర్, పాణ్యం, బనగానిపల్లి, నంద్యాల, గడివేముల, చాగలమర్రి, పాములపాడు ప్రాంతాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి.
  • కడప జిల్లా: మైదుకూరు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కడప టౌన్, బద్వేల్, పులివెందుల, కమలాపురం ప్రాంతాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి.
  • అనంతపురం జిల్లా: హిందుపూర్, కల్యాణదుర్గం, అనంతపురం టౌన్
  • చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తి, తిరుపతి అర్భన్, రేణిగుంట, వరదాయపాలెం, సత్యవేడు, నాగాలపురం, నగరి, పుత్తూరు, వెంకటగారికోట
  • ఈస్ట్ గోదావరి జిల్లా: సామర్లకోట, పెద్దాపురం, కొత్తపేట, రాజమండ్రి అర్బన్, పీఠాపురం, శంకవరం
  • గుంటూరు జిల్లా: మాచర్ల, దాచేపల్లి, అచ్చంపేట్, నర్సరావుపేట, గుంటూరు టౌన్, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలు రెడ్‌జోన్‌లో ఉన్నట్టు సమాచారం





SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Latest Announcement: District wise by Red zone"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0