Lockdown 4.0 from tomorrow. Terms
రేపటి నుంచి లాక్‌డౌన్ 4.0.. నిబంధనలు ఇలా.
దేశవ్యాప్తంగా అమలవుతున్న మూడోదశ లాక్ డౌన్ నేటితో ముగియనుండగా.. రేపటి నుంచి లాక్‌డౌన్ 4.0 ఉంటుందని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటుంది.? నిబంధనలు ఏంటి.? ఎలాంటి మినహాయింపులు ఉంటాయి.? అనే వివరాలకు సంబంధించి ప్రకటన ఇవాళ వెలువడుతుంది. కాగా, మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక మరిన్ని సడలింపులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందని సమాచారం. ప్రధాని మోదీ ముందుగా చెప్పినట్లు గత మూడో దశల లాక్ డౌన్ కంటే ఇది పూర్తి భిన్నంగా ఉండనుంది.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 30 మునిసిపల్ ఏరియాస్‌ను కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయనున్నారు. గ్రేటర్ ముంబై, గ్రేటర్ చెన్నై, అహ్మదాబాద్, థానే, ఢిల్లీ, ఇండోర్, పూణే, కోల్‌కతా, జైపూర్, నాసిక్, జోధ్పూర్, ఆగ్రా, తిరువల్లూరు, ఔరంగాబాద్, కడలూరు, గ్రేటర్ హైదరాబాద్, సూరత్, చెంగల్‌పట్టు, కర్నూలు, భోపాల్, అమృత్‌సర్, విల్లుపురం, వడోదర, ఉదయపూర్, పాల్ఘర్, బెర్హంపూర్, సోలాపూర్, మీరట్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. అటు గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లను నిర్ధారించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే పరిమితం చేసింది. దీనితో ఇక మీదట కంటైన్మెంట్ జోన్, బఫర్ జోన్‌గా ప్రాంతాలను విభజించనున్నట్లు తెలుస్తోంది.
రూల్స్ ఇలా ఉండనున్నాయి..

- పాఠశాలలు, థియేటర్లు, మాల్స్, జిమ్‌లు మినహా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని కార్యకలాపాలకు అనుమతించే అవకాశం ఉంది.
- కంటైన్మెంట్ జోన్లు మినహాయించి ప్రజా రవాణా పరిమితంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
- రైల్వేశాఖ నడుపుతున్న స్పెషల్ ట్రైన్స్ యధావిధిగా కొనసాగనున్నాయి.
- రాష్ట్రాలకు ఎటువంటి అభ్యంతరాలు లేకపోతే దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి.
- కంటైన్మెంట్ జోన్లు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ పార్లర్, సెలూన్లు తెరుచుకోనున్నాయి.
- మత సంస్థలు, మందిరాలు మూసి ఉంచుతారు.
- కాగా, 'ప్రజలు తమ నివాసలలోనే ఉండేలా కంటైన్మెంట్ జోన్లలో CRPC క్రింద సెక్షన్ 144 అమలు చేయబడుతుంది. అయినప్పటికీ ఆ ప్రాంతాల్లో నిత్యావసరాలకు కొరత ఏర్పడకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ జారీ చేసిన నూతన మార్గదర్శకాలు పేర్కొన్నాయి.
0 Response to "Lockdown 4.0 from tomorrow. Terms "
Post a Comment