Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Move on teacher transfers!

ఉపాధ్యాయ బదిలీలపై కదలిక!
ఖాళీల వివరాలు పంపాలని ఉత్తర్వులు
Move on teacher transfers!

ఉపాధ్యాయ బదిలీలపై కదలిక మొదలైంది. వాటికి సంబంధించిన ఖాళీల వివరాలను తక్షణమే పంపాలంటూ బుధవారం అనంతపురం డీఈఓ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి.
 ఆగమేఘాలపై విద్యాశాఖ అధికారులు ఖాళీల లెక్క తీసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని మండల విద్యాధికారులకు వివరాలు పంపాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో వారు వివరాలు తీసే పనిలో ఉన్నారు.
8 ఏళ్లు ఉంటే కదలాల్సిందే
గత ప్రభుత్వ హయాంలో 2017లో పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. ఎస్జీటీలు, పాఠశాల సహాయకులకు సంబంధించి 2020 ఫిబ్రవరి 29 నాటికి ఎవరైతే ఎనిమిదేళ్లు ఒకే ప్రాంతంలో ఉంటారో వారి వివరాలను క్రోడీకరించారు. ఇలాంటివారు సుమారు 1500 నుంచి 1800మంది ఉంటారు.
ప్రధానోపాధ్యాయులకు సంబంధించి ఐదేళ్ల ప్రాతిపదికన బదిలీల ప్రక్రియ ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు సుమారు 150 మంది వరకు ఉండొచ్ఛు
క్లియర్‌ వేకెన్సీలు జిల్లాలో 600 వరకు ఉన్నాయి.
లాక్‌డౌన్‌ ఉండటంతో ఆన్‌లైన్‌ విధానంలో బదిలీలు చేపడితే ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం బదిలీల షెడ్యూల్‌ ప్రకటించే వీలుంది.
టీచర్ల బదిలీలకు కసరత్తు .. ! ఎనిమిదేళ్లు నిండితే స్థాన చలనమే విశాలాంధ్ర బ్యూరో - అమరావతి : రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది . టీచర్స్ బదిలీలు చేపట్టాలని ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి . ఇటీవల విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లోనూ ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది . దీంతో జిల్లాల వారీగా ఉన్న ఉపాధ్యాయుల ఖాళీలతో పాటు లాంగ్ స్టాండింగ్ ( ఎనిమిదేళ్లు ) ఉపాధ్యాయుల వివరాలను పంపించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వీ చిన వీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు . ఖాళీలు , లాంగ్ స్టాండింగ్ వివరాల జాబితాను రూపొందించాకే బదిలీల ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది . ఇదే సమయంలో ఖాళీ ప్రదేశాలు , లాంగ్ స్టాండింగ్ పై ఖాళీ అయ్యే స్కూళ్లు ఏ హెమోద్ పరిధిలో ఉన్నాయో కూడా తెలియజేయాలని విద్యాశాఖ కమిషనరేట్ అధికారులు సూచించారు . ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ప్రొఫార్మను రూపొందించగా , అది ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారుల ( డీఈఓ ) కార్యాలయాలకు చేరింది . వాటి ప్రకారం పాఠశాలల్లో ఎనిమిదేళ్లు , ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు , క్లీయర్ వేకెన్సీ పోస్టుల వివరాలను తెలియజేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు అందాయి . ప్రాథమిక , ప్రాథమికోన్న పాఠశాలల్లోని ఖాళీలు , లాంగ్ స్టాండింగ్ వివరాలను ఆయా మండల విద్యాశాఖాధికారులు సేకరించి డీఈఓ కార్యాలయాలను పంపించాలని ఆదేశాలందాయి . డీఈఓ కార్యాలయానికి అందిన వివరాల ఆధారంగా ఖాళీలు , లాంగ్ స్టాండింగ్ పోస్టుల వివరాలను హెల్తవ్ ఆధారంగా విభజించి ఆన్లైన్ లో కమిషనరేట్ కు పంపించాలని ఉత్తర్వులలో ప్రభుత్వం పేర్కొంది . ఉపాధ్యాయ బదిలీలకు ఈ ఏడాది ఫిబ్రవరి 29 వ తేదీని ప్రభుత్వం కటాఫ్ గా నిర్ణయించింది . ఆ తేదీని ఆధారంగా తీసుకుని ఈ ఖాళీలు , ఒకేచోట ఐదు లేదా ఎనిమిదేళ్లపాటు పని చేసిన ఉపాధ్యాయుల వివరాలను ప్రొఫార్మాలో పొందుపరచనున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Move on teacher transfers!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0