Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Officers' thinking on how to conduct 10th class exams

  • పది ‘పరీక్షే’...
  • భౌతికదూరం పాటించి నిర్వహణకు ప్రభుత్వ యోచన
  • తప్పని రెట్టింపు భారం
  • 213 కేంద్రాలు కాస్తా 400 దాటాల్సిందే...
  • విద్యార్థులు, అధికారులకు అవస్థలే*
  • కేంద్రాల వారిగా ప్రశ్నపత్రాలు, హాల్‌టికెట్లు
  • సీఎస్, డీఓలు, ఇన్విజిలేటర్లు రెట్టింపు కావాల్సిందే
  • ఫర్నీచర్‌ కోసం వెతుకులాటే...
  • బడ్జెట్‌ సైతం రూ.2 కోట్లు దాటే ఛాన్స్‌ 
  • సాధ్యాసాధ్యాలపై అధికారుల మల్లగుల్లాలు
Officers' thinking on how to conduct 10th class exams

ఈ ఏడాది పది పరీక్షల నిర్వహణ అధికారులకు పరీక్షగానే మారింది. భౌతికదూరం పాటించి పరీక్షలు నిర్వహించాలంటే పెద్ద సవాల్‌ అనే చెప్పాలి. ముఖ్యంగా కొవిడ్‌-19 వల్ల ఇప్పటికే పలుమార్లు పరీక్షలు వాయిదా పడ్డాయి.
ఒకవేళ భౌతికదూరం పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లో 12-16 చొప్పున విద్యార్థులను కూర్చోబెట్టి నిర్వహించాలంటే మాత్రం అధికారులకు అన్నీ రెట్టింపు భారం కానున్నాయి. పైగా ఇప్పటికే కేంద్రాల వారిగా ప్రశ్నపత్రాలు ముద్రణ అయ్యి వచ్చేశాయి. ఇప్పుడు ఉన్నఫలంగా కేంద్రాలు మారిస్తే తీవ్ర ఇబ్బందులుపడే అకాశం ఉంది.
పైగా గతంలో ఉన్న కేంద్రాలు, సిబ్బంది, ఆఖరికి నిర్వహణ బడ్జెట్‌ సైతం రెట్టింపు కానుందనడంలో సందేహం లేదు. ఈనేపథ్యంలో 2019 పదో తరగతి పరీక్షలు అధికారులకు పరీక్షగానే నిలవనున్నాయి.
తప్పని రెట్టింపు భారం
  • కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షల వాయిదా పరంపర కొనసాగుతూ వస్తోంది. 
  • ఎట్టకేలకు భౌతికదూరం పాటించి పరీక్షలు నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. 
  • దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు సైతం ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఇలా చేపట్టాలంటే.. 
  • అన్ని పనులు రెట్టింపు కానున్నాయి.
  •  జిల్లాలో 213 పరీక్ష కేంద్రాలు ఉంటే 51,592 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 
  • ఒక్కో గదికి సహజంగా 20-24 మంది విద్యార్థులను కూర్చోబెడుతారు.
  •  భౌతికదూరం పాటించాల్సి వస్తే ఒక్కో గదిలో 12-16 మందిని కూర్చోబెట్టాల్సి ఉంటుంది. 
  • ఈ లెక్కన 213 కేంద్రాలు కాస్తా 400 పైచిలుకు కానున్నాయి. 
  • అదేవిధంగా చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు... 
  • ఇలా అన్ని రకాల పరీక్షల సిబ్బంది 10 శాతం అదనపు సిబ్బందితో కలిపి 2,500 మంది కావాల్సి వస్తే అది కాస్తా 5 వేల మందికి పెంచుకోవాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

కేంద్రాలు పెరిగితే అందరికీ హైటెన్షనే

  • పరీక్షలు అటు విద్యార్థులు, తల్లిదండ్రులకు తోడు అధికారులు, సిబ్బందికి హైటెన్షన్‌ పుట్టిస్తున్నాయి. 
  • ఇప్పటికే ప్రశ్నపత్రాలు కేంద్రాల వారిగా ముద్రణ చేసి పంపించారు. 
  • ఇదివరకు 213 కేంద్రాలు ఉంటే ఆ మేరకు సరఫరా చేసి ఉంటారు. 
  • ఉన్నఫలంగా కేంద్రాలు పెంచితే ప్రశ్నపత్రాలతో పాటు విద్యార్థులు సైతం పెరిగిన కేంద్రాలకు మారాల్సి ఉంటుంది.
  •  హాల్‌టికెట్లలో విద్యార్థులకు తమ సెంటర్‌ ముందే తెలిసి ఉంటుంది. ఇప్పుడు తీరా సెంటర్ల పెంపు వల్ల మరోచోటకు వెళ్లాల్సి ఉంటుంది. 
  • అదేవిధంగా విద్యార్థులు బెంచీలపైనే కూర్చుని రాయాలంటే మాత్రం... అసలే అరకొర ఫర్నీచర్‌తో నెట్టుకొస్తున్న అధికారులు 400 పైచిలుకు కేంద్రాలకు ఫర్నీచర్‌ సమకూర్చుకోవడంం తలకుమించిన భారమే. 
  • ఇప్పటికే సుమారు పరీక్షల నిర్వహణకు రూ.1.15 కోట్లు మంజూరు చేసినట్లు సమాచారం. 
  • అది కూడా రెట్టింపు భారం నేపథ్యంలో రూ.2 కోట్లు మించినా ఆశ్చర్య పోనక్కరలేదని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 
  • మొత్తమ్మీద పది పరీక్షలు అధికారులకు పరీక్షగానే సవాల్‌ విసురుతున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Officers' thinking on how to conduct 10th class exams"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0