Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About Teacher posts

30 వేల టీచర్‌ పోస్టులు మాయం!
ప్రాధమిక పాఠశాలల్లో 15 వేలు
హైస్కూళ్లలో 12 వేలకు పైగా
డీఎస్సీ నోటిఫికేషన్లకూ నో చాన్స్‌
హేతుబద్ధీకరణపై టెన్షన్‌
About Teacher posts


ప్రభుత్వ రంగ పాఠశాలల్లో హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు అమలైతే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30వేల టీచర్‌ పోస్టులు మాయమవుతాయని తెలుస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో 15 వేలు, ఉన్నత పాఠశాలల్లో 12 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో  రెండు నుంచి మూడు వేల వరకు పోస్టులు రద్దవుతాయని అంచనా వేస్తున్నారు. ఫలితంగా భవిష్యత్తులో డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసే పరిస్థితి ఉండకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి... పాఠశాలలు తెరిచిన తర్వాత విద్యార్థుల చేరికను బట్టి హేతుబద్ధీకరణ చేయాల్సి ఉండగా.. 2020 ఫిబ్రవరిలో ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికనే రేషనలైజేషన్‌పై ముందుకెళ్లాలని ప్రతిపాదించడం గమనార్హం. 
విద్యాహక్కు చట్టం ప్రకారం 1:30 నిష్పత్తిలో టీచర్‌-విద్యార్థులు ఉండేలా ప్రతిపాదనలు ఉన్నప్పటికీ...  ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో భారీగా తగ్గుదల ఉంటుందని చెబుతున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం అంటున్న ప్రభత్వం... ఆ చట్టం ప్రాథమిక విద్య (1-8 తరగతులు) వరకు మాతృభాషలోనే బోధించాలని చెప్పిన విషయాన్ని  పట్టించుకోలేదని పలువురు విమర్శిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఇకపై సింగిల్‌ టీచర్‌లు ఉండరని, కనీసం ఇద్దరు టీచర్లు ఉంటారని చెబుతూనే.. అసలుకే ఎసరు పెట్టేలా హేతుబద్ధీకరణ కార్యాచరణ ఉందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు 20లోపు విద్యార్థులు ఉంటే సింగిల్‌ టీచర్‌, 40 వరకు ఉంటే రెండో పోస్టు, 60 వరకు మూడో పోస్టు, 80 వరకు నాలుగో పోస్టు, 100 వరకు ఐదో పోస్టు, 120 వరకు ఆరో పోస్టు + ఎల్‌ఎ్‌ఫఎల్‌ హెడ్మాస్టర్‌ పోస్టు కేటాయిస్తున్నారు. ఇప్పుడు... 1:30 ప్రకారమే టీచర్ల పోస్టులను ఇస్తామంటున్నారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడతామని, తెలుగు ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంటుందని, ప్రతి మండలానికో తెలుగు మీడియం పాఠశాల ఏర్పాటు చేస్తామని కోర్టుకు చెప్పిన ప్రభుత్వం.. తాజా హేతుబద్ధీకరణ ప్రతిపాదనల్లో మాత్రం టీచర్‌ పోస్టుల లెక్కల్లో స్పష్టత ఇవ్వలేదు. ఉన్నత పాఠశాలల్లో ఇప్పటి వరకు 240 మంది విద్యార్థులకు 9 పోస్టులను నిర్ధారించారు. 240  మందికి మించి విద్యార్థులు ఉంటే మరో సెక్షన్‌ ఇచ్చే వారు. ఇప్పుడు 320 మందికి మించితేనే రెండో సెక్షన్‌ ఇస్తామని ప్రతిపాదించారు. అంతకన్నా తక్కువ మంది ఉంటే సింగిల్‌ పోస్టు మాత్రమే కేటాయిస్తారన్న మాట. తాజా ప్రతిపాదనల వల్ల టీచర్‌ పోస్టులు రద్దయ్యే అవకాశం ఉన్నందు వల్ల తక్షణమే హేతుబద్ధీకరణను వాయిదా వేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టీఎన్‌టీయూఎస్‌) గౌరవాధ్యక్షులు డాక్టర్‌ ఎ.ఎ్‌స.రామకృష్ణ, అధ్యక్షులు చెరుకూరి సుభాష్‌ చంద్రబో్‌సలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాఠశాలలు తెరిచిన తర్వాత నెలరోజుల పాటు అడ్మిషన్లకు గడువు ఇచ్చి అనంతరం హేతుబద్ధీకరణ చేపట్టాలని వారు కోరారు.

మూలం:ఆంధ్రజ్యోతి


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "About Teacher posts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0