Changes in the living Places of the houses in AP .. New Conditions Now!
ఏపీలో ఇళ్ల స్థలాల జీవోలో మార్పులు.. న్యూ కండిషన్స్ ఇవే!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశమైన.. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో భాగంగా ఏపీలో జులై 8న ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు అర్హులైన 27 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన వారికి ఆగస్ట్ 14వ తేదీన ఇళ్లు నిర్మించడానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టనున్నట్లు ఏపీ కేబినెట్ పేర్కొంది. అలాగే ఈ ఇళ్ల స్థలాల కోసం మొత్తం 42,920 భూములు అవసరం కానున్నాయి. ఈ పథకం కోసం ఏపీ సర్కార్ 25,842 ఎకరాల ప్రభుత్వ భూములు, 16,078 ఎకరాల ప్రైవేటు భూములను వినియోగించనుంది.
ఇప్పటికే రాష్ట్రంలోని 16 వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలు లే ఔట్స్ వేసింది ప్రభుత్వం. 2023 నాటికి రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం జగన్ టార్గెట్‌గా పెట్టుకున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు. అయితే కేటాయించిన ఇళ్ల స్థలాలను విక్రయంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం జీవో నెంబర్-99లో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు ఆయన తెలిపారు.
నిబంధనలు:- ప్రభుత్వం ఇచ్చిన ఖాళీ స్థలాన్ని లబ్ధిదారులు విక్రయించడానికి వీల్లేదు
- ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చిన తర్వాత లబ్ధిదారులు ఆ ఇంట్లో కనీసం ఐదేళ్లు ఉండాలి
- అలా నివసించిన తర్వాత మాత్రమే దాన్ని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది
- అమ్మేటప్పుడు కూడా పలు కండీషన్‌లను పాటించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
0 Response to "Changes in the living Places of the houses in AP .. New Conditions Now!"
Post a Comment