Don't use those mobile apps .. Intelligence references to the center ..
ఆ మొబైల్ యాప్స్ ను వాడకుండా చూడండి .. కేంద్రానికి ఇంటెలిజెన్స్ సూచనలు ..
భారత్ - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో దాదాపు 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. భారతసైన్యంపై చైనా దాడిచేయడంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి బుధవారం కీలక సూచనలు చేశారు. చైనాతో లింక్ ఉన్న 52 మోబైల్ అప్లికేషన్‌లను బ్లాక్ చేయాలని లేదా.. వాటిని వాడకుండా దేశ ప్రజలకు పిలుపునివ్వాలని సూచనలు చేశారు. ఈ జాబితాలో జూమ్ యాప్, టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, జెండర్, షేర్‌ఇట్, క్లీన్ మాస్టర్‌తో పాటు మరో 52 అప్లికేషన్లను ఇంటెలిజెన్స్ అధికారులు తమ జాబితాలో పేర్కొన్నారు.
కాగా.. ఇంటెలిజెన్స్ అధికారులు సూచించిన వీటికి.. జాతీయ భద్రతా కౌన్సిల్ కూడా మద్దతు పలికిందని, ఇవి భారత దేశ భద్రతకు అత్యంత ప్రమాదకారులని సంబంధిత అధికారులు ధ్రువీకరించుకున్నారని ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సిఫార్సులపై కేంద్రం చాలా లోతుగా చర్చలు జరుపుతోందని, ప్రతి మొబైల్ యాప్‌తో వచ్చే ప్రమాదాన్ని ఒక్కొక్కటిగా అధికారులు పరిశీలిస్తూనే ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. జూమ్ యాప్ ఏమాత్రం సురక్షితం కాదని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌లోనే స్పష్టం చేసిన విషయం విదితమే.
0 Response to "Don't use those mobile apps .. Intelligence references to the center .."
Post a Comment