Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Empty accounts with remote apps! Rooted Jharkhand Cyber ​​Cheaters

రిమోట్‌ యాప్‌లతో ఖాతాలు ఖాళీ!
రూటుమార్చిన జార్ఖండ్‌ సైబర్‌ మోసగాళ్లు
ఓటీపీకి స్పందన లేకపోవడంతో కొత్తరూటు
సైబరాబాద్‌లో ఐదునెలలో 20 కోట్లు కాజేశారు.
Empty accounts with remote apps!  Rooted Jharkhand Cyber ​​Cheaters

 ఓటీపీ అనగానే ఇప్పుడు చాలామంది ఫోన్‌ కట్‌ చేస్తుండటంతో సైబర్‌ నేరగాళ్లు కొత్తరూటు ఎంచుకున్నారు. ఓటీపీ సైబర్‌ దొంగలుగా పేరొందిన జార్ఖండ్‌ ముఠాసభ్యులు ఇప్పుడు రిమోట్‌యాప్‌లతో దోచేస్తున్నారు. ఎనీడెస్క్‌యాప్‌, టీమ్‌ వ్యూయర్‌యాప్‌, క్విక్‌సపోర్టుతోపాటు మరికొన్ని రిమోట్‌యాప్‌లను తమ చోరీలకు అస్ర్తాలుగా వాడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన సుధాకర్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. సార్‌.. ఎయిర్‌టెల్‌ నుంచి మాట్లాడుతున్నా. మీ ఫోన్‌ సేవలు కొద్దిసేపట్లో నిలిచిపోతాయి. ఇందుకు మీరు కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలన్నాడు. మీరు జస్ట్‌ క్విక్‌సపోర్టు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.. మిగతాది మేము చూసుకుంటాం.. అన్నారు. అప్పటికే సుధాకర్‌కు కొన్ని ముఖ్యమైన కాల్స్‌ వచ్చేవి ఉండటంతో ఓకే అన్నాడు. క్విక్‌ సపోర్ట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని అతనికి ఐడీని కూడా చెప్పేశాడు. సార్‌ మీరు ఎవరికైనా ఓ రూపాయిని ట్రాన్స్‌ఫర్‌ చేయండని చెప్పాడు. అలా పది నిమిషాలు గడిచిందో లేదో.. సుధాకర్‌ ఖాతా నుంచి లక్ష రూపాయలు మాయమయ్యాయి. ఖంగుతిన్న సుధాకర్‌.. వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదుచేశారు. సుధాకర్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఐడీ ఇవ్వగానే దాంతో పార్టనర్‌గా మారిన సైబర్‌ క్రిమినల్‌.. రూపాయి బదిలీ చేయమన్నప్పుడు సుధాకర్‌ యూపీఐ పిన్‌నెంబర్‌, పాసువర్డును తెలుసుకొని మరుక్షణమే లక్ష రూపాయలు కొట్టేశాడు. ఇలా ఒక సుధార్‌ కాదు.. చాలామంది ఇటీవల రిమోట్‌యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని తమ ఖాతాలను గుల్లచేసుకున్నారు. ఇలా ఒక్క సైబరాబాద్‌ పరిధిలోనే గత ఐదునెలలో వివిధ సైబర్‌ క్రైం అంశాలకు సంబంధించి బాధితులు రూ.20 కోట్లు పోగొట్టుకున్నారు.
రిమోట్‌యాప్‌ డౌన్‌లోడ్‌చేస్తే ఏమైతదంటే
కంప్యూటర్లలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతర ప్రాంతాల్లో ఉండే నిపుణులు రిమోట్‌యాప్‌ల ద్వారా వాటిని పరిష్కరించేవారు. ఉదాహరణకు ఇండియాలో ఉన్న కార్పొరేట్‌ సంస్థ కంప్యూటర్లలో ఏ సమస్య వచ్చినా, లేదా పని పురోగతి తెలుసుకోవడానికి ఈ యాప్‌లను వినియోగించేవారు. రిమోట్‌యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత ఒక ఐడీ వస్తుంది. దానిని మనం అవతలివారికి చెప్తే వారు ఆ ఐడీని కాపీచేసుకుని పార్టనర్‌గా మారి మన కంప్యూటర్‌ను ఇతర ప్రాంతం నుంచి చూస్తారు. ఇది సాంకేతికంగా ఐటీ పరిశ్రమలో చాలా ఉపయోగపడుతుంది. కానీ, దీనిని జార్ఖండ్‌ సైబర్‌ నేరగాళ్లు తమ నేరాలకు అనువుగా మార్చుకుంటున్నారు. వాటిని డౌన్‌లోడ్‌ చేయించి మన కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌లను వారి ఆధీనంలోకి తెచ్చుకుని మన ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ బ్యాంక్‌ ఐడీలను తెలుసుకుని ఖాతాల్లో డబ్బును దోచేస్తున్నారు.
యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఎవరూ చెప్పరు
ఏ బ్యాంక్‌, ఏ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రిమోట్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోమని చెప్పవు. ఉన్నత విద్యావంతులతోపాటు ఫోన్‌పై అవగాహన ఉన్నవారిని సైతం సైబర్‌ మాయగాళ్లు బోల్తా కొట్టిస్తున్నారు. అదే సాధారణ ఫోన్లు వాడి కొంచెం తెలివిగా ఉండే వారిని వీరు మోసం చేయలేపోతున్నారని మా అధ్యయనంలో తేలింది. ఏటీపీలు, రిమోట్‌యాప్‌ల ఐడీ చెప్పొద్దు. కేవైసీలు అన్నా పట్టించుకోవద్దు. ముఖ్యంగా హిందీలో మాట్లాడి మేము అధికారులమంటే అది సైబర్‌కాల్‌గా అనుమానించాలి. భాషయాసను గుర్తుపట్టండి. వచ్చి రాని ఆంగ్లం, ఉత్తరాది యాసలో హిందీ మాట్లాడితే వారికి సమాధానం ఇవ్వకుండా ఫోన్‌కట్‌ చేయాలి.

సీహెచ్‌వై శ్రీనివాస్‌కుమార్‌, ఏసీపీ సైబరాబాద్

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Empty accounts with remote apps! Rooted Jharkhand Cyber ​​Cheaters"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0