Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Explain the advantages and disadvantages of general counseling and web counseling

సాధారణ కౌన్సెలింగ్ కి, వెబ్ కౌన్సెలింగ్ కి ఉన్న అనుకూలతలు,ప్రతికూలతలు ఏమిటి?
Explain the advantages and disadvantages of general counseling and web counseling


  • 1.సాధారణ కౌన్సిలింగ్ కి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
  • వెబ్ కౌన్సెలింగ్ కి కూడా అంతే.
  • 2.సాధారణ కౌన్సెలింగ్ కోసం,DEO గారు ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్తాము.
  • వెబ్ కౌన్సెలింగ్ కోసం నెట్ సెంటర్ల చుట్టూ తిరగాలి.
  • 3.సాధారణ కౌన్సెలింగ్ లో మన ముందు ఏఏ ఖాళీలు అయిపోయాయో తెలుస్తుంది.
  • వెబ్ కౌన్సెలింగ్ లో అటువంటి అవకాశం లేదు.
  • 4.సాధారణ కౌన్సెలింగ్ లో మనం ఏ ప్లేస్ కోరుకోబోతున్నామో తెలుస్తుంది.
  • వెబ్ కౌన్సెలింగ్ లో అటువంటి అవకాశం లేదు.
  • 5.సాధారణ కౌన్సెలింగ్ లో మెంటల్ టెన్షన్ ఒక గంట మాత్రమే.
  • వెబ్ కౌన్సెలింగ్ లో మెంటల్ టెన్షన్ బాగా ఎక్కువ. ఉదాహరణకు జిల్లాలో 2000 క్లియర్+8 ఇయర్స్ ఖాళీలు ఉన్నాయి అనుకోండి.3000 మంది బదిలీలు కోసం దరఖాస్తు చేశారు అనుకోండి.అంటే ఇప్పుడు మొత్తం ఖాళీలు 5000 అని అర్ధం.8 ఇయర్స్ దాటినవారు 5000 వెబ్ ఆప్షన్లు పెట్టవలసి ఉంటుంది.
  • 6.సాధారణ కౌన్సెలింగ్ లో నెట్ సెంటర్ తో పనిలేదు.
  • వెబ్ కౌన్సిలింగ్ లో నెట్ సెంటర్ల చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరగాలి.5000 వెబ్ ఆప్షన్లు పెట్టటానికి నెట్ సెంటర్ వాడు ఇష్టపడాలి.5000 వెబ్ ఆప్షన్లు పూర్తి అయ్యేవరకు నెట్ సెంటర్ వాడు మనకు టైమ్ కేటాయించాలి.మనతో పాటు మన ప్రక్కన కూర్చోవాలి.
  • 7.సాధారణ కౌన్సెలింగ్ కి ఎటువంటి డబ్బులు ఖర్చు ఉండదు.
  • వెబ్ కౌన్సెలింగ్ లో నెట్ సెంటర్ వాడు 5000 ఆప్షన్లు మన ప్రక్కన కూర్చొని పెట్టటానికి ఎంత తీసుకుంటాడో ఆలోచించండి.
  • 8.సాధారణ కౌన్సెలింగ్ కి ఎటువంటి OTP లతో అవసరం లేదు.
  • వెబ్ కౌన్సెలింగ్ లో నీ సెల్ ఫోన్ కి OTP లు వస్తాయి.సర్వర్ ప్రాబ్లమ్ తో OTP లు సకాలంలో రాక,మెంటల్ టెన్షన్ అనుభవించిన వారు కోకొల్లలు.
  • 9.సాధారణ కౌన్సెలింగ్ లో వెంటనే ఆర్డర్ కాపీ పొందవచ్చు.
  • వెబ్ కౌన్సెలింగ్ లో ఆర్డర్ కాపీ కూడా నెట్ సెంటర్ కి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • 10.సాధారణ కౌన్సెలింగ్ లో ఆర్డర్ కాపీ తీసుకోవటానికి ఒక గంట మాత్రమే పడుతుంది.
  • ఆదే వెబ్ కౌన్సెలింగ్ లో ఐతే వెబ్ ఆప్షన్లు ఇచ్చిన రోజు నుండి కనీసం నాలుగు రోజులు తర్వాత మాత్రమే ప్లేస్ ఏది వచ్చిందో తెలుస్తుంది.తెలిసిన తర్వాత ఆర్డర్ కాపీ డౌన్లోడ్ చేసుకోవటానికి మరోరోజు పడుతుంది.
  • 11.సాధారణ కౌన్సెలింగ్ లో place కోసం మెంటల్ టెన్షన్ అవసరం లేదు.
  • అదే వెబ్ కౌన్సెలింగ్ లో ఐతే ఏ place వస్తుందో తెలియక నరకం అనుభవించాలి.
  • 12.సాధారణ కౌన్సెలింగ్ లో బాధ ఒక గంట మాత్రమే.
  • అదే వెబ్ కౌన్సెలింగ్ లో దరఖాస్తు చేసినప్పటినుండి,ఆర్డర్ కాపీ డౌన్లోడ్ చేసుకొనేంతవరకు(సుమారు ఆరు రోజులు)నరకం ఎలా ఉంటుందో కళ్ళ ముందు కనిపిస్తుంది.


That's why .. Unions must ask the Govt. to implement Manual Councilling.. for the sake of all teachers..

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Explain the advantages and disadvantages of general counseling and web counseling"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0