Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news for the unemployed ... active arrangements for 17,000 secretariat jobs

నిరుద్యోగులకు శుభవార్త ... 17 వేల సచివాలయ ఉద్యోగాల భర్తీకి చురుగ్గా ఏర్పాట్లు.
Good news for the unemployed ... active arrangements for 17,000 secretariat jobs

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ ఉన్న 17,097 పోస్టుల భర్తీకి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి జగన్ కు అధికారులు తెలిపారు. జూలై నెలాఖరులో పరీక్షలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నామని అధికారులు వివరించారు. వైద్యశాఖలో ఖాళీగా వున్న పోస్టులు, గ్రామ-వార్డు సచివాలయాల్లో పోస్టులు అన్నీ కలిపి ఒకేసారి షెడ్యూల్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.

గ్రామ, వార్డు సచివాలయాలు, వార్డు వాలంటీర్ల వ్యవస్థపై సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మౌలిక సదుపాయాలపై సీఎం అధికారులతో చర్చించారు. లబ్ధిదారుల జాబితా, గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన నంబర్ల జాబితా, ప్రకటించిన విధంగా నిర్ణీత కాలంలో అందే సేవల జాబితా, ఈ ఏడాదిలో అమలు చేయనున్న పథకాల క్యాలెండర్‌ను అన్ని గ్రామ, వార్డు, సచివాలయాల్లో ఉంచాలని సీఎం ఆదేశించారు.
అలా ఉంచారా? లేదా? అన్నదానిపై ఈనెల 20లోగా జియో ట్యాగింగ్ వెరిఫికేషన్‌ పూర్తవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు.

మార్చి 2021 నాటికి గ్రామ, వార్డు సచివాలయాల సొంత భవనాల నిర్మాణం పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల శిక్షణపై వివరాలను సీఎంకు అందించారు అధికారులు. అలాగే వాలంటీర్లకు శిక్షణపైనా సీఎం ఆరా తీశారు. వాలంటీర్లకు సెల్‌ఫోన్లు ఇచ్చినందున డిజిటిల్‌ పద్ధతుల్లో వారికి శిక్షణ ఇచ్చే ఆలోచన చేయాలన్నారు సీఎం. అంతేకాకుండా అవగాహన చేసుకున్నారా? లేదా? అన్నదానిపై వాలంటీర్లకు ప్రశ్నావళి పంపాలన్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news for the unemployed ... active arrangements for 17,000 secretariat jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0