Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiration

HBD Sunder Pichai : ఓ సీ - గ్రేడర్ ... GOOGLE సీఈఓ ఎలా అయ్యాడు ... సుందర్ పిచాయ్ జీవితం ఇదీ.
Inspiration

Sundar Pichai Birthday : ప్రస్తుతం ప్రపంచ యువత ఆదర్శంగా తీసుకునేవారిలో సుందర్ పిచాయ్ ఒకరు . ఆయన 49 వ పుట్టిన రోజు సందర్భంగా ... ఆయన జీవిత ప్రయాణాన్ని తెలుసుకుందాం .

Sundar Pichai Birthday GOOGLE, ఆల్ఫాబెట్ సంస్థల సీఈఓ సుందర్ పిచాయ్ అసలు పేరు పిచాయ్ సుందరరాజన్. నేడు ఆయన 48వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. వీలైనంతవరకూ సైలెంట్‌గా, చాలా నిదానంగా, కఠినత్వం అన్నదే లేకుండా మాట్లాడే ఈ చెన్నై బాయ్... ప్రపంచంలోనే అతి పెద్ద ప్రముఖ ఐటీ కంపెనీకి సీఈఓగా ఎలా ఎదిగారు? నిజానికి ఆయన జర్నీ అంత సాఫీగా సాగలేదు. ఎన్నో పోరాటాలు చేశారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. అట్టడుకు స్థాయి నుంచి ఒక్కో మెట్టూ ఎక్కుతూ... టెక్నాలజీకి దగ్గరయ్యేంత ఆర్థిక స్తోమత లేకపోయినా... పట్టుదలతో టెక్నాలజీవైపు అడుగులు వేస్తూ... అందరికీ ఆదర్శంగా నిలిచారు.
పిచాయ్ జీవిత ప్రారంభం :
చైన్నైలో 1972లో పుట్టారు సుందర్ పిచాయ్. ఆయన తండ్రి ఓ ఎలక్ట్రికల్ ఇంజినీర్. బ్రిటన్‌కి చెందిన జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో పనిచేసేవారు. ఆయన తల్లి ఓ స్టెనోగ్రాఫర్. పిచాయ్ కూడా ఆ కాలంలో చాలా మంది లాగే... టీవీ, కార్ వంటివి ఏవీ లేకుండానే పెరిగారు. ఇప్పటి ప్రపంచంతో పోల్చితే తన చిన్నప్పటి జీవితం చాలా సింపుల్‌గా ఉండేదని పిచాయ్... న్యూయార్క్‌లో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

పిచాయ్ ఫ్యామిలీ... ఓ అద్దె ఇంట్లో ఓనర్ ఫ్యామిలీతో కలిసి ఉండేవాళ్లు. అప్పట్లో నీటి కొరత చాలా ఎక్కువ. అందువల్ల చాలా ఆందోళన చెందేవారు. పిచాయ్ నిద్రపోయేటప్పుడు ఎప్పుడూ ఓ బాటిల్ నీరు పక్కనే పెట్టుకొని పడుకునేవారట. అప్పట్లో చాలా ఇళ్లలో ఫ్రిజ్ ఉండేది. కొంతకాలం తర్వాత అతి కష్టమ్మీద పిచాయ్ ఫ్యామిలీ కూడా ఓ ఫ్రిజ్ కొనుక్కున్నారు.

స్కూల్లో చదివేటప్పుడు పిచాయ్ నెంబర్ వన్ స్టూడెంట్. స్కూల్ క్రికెట్ టీమ్‌కి ఆయనే కెప్టెన్. తర్వాతి కాలంలో ఆయన చదువులో కూడా ఫెయిల్యూర్స్ చూశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివేటప్పుడు... ఓ సబ్జెక్టులో తనకు సీ గ్రేడ్ వచ్చిందనీ... తర్వాత కాలంలో దాన్ని అధిగమించానని చెప్పారు. మొదటి ఏడాది CGP చాలా కష్టంగా ఉండేదనీ... తర్వాత మూడేళ్లపాటూ... దానిపై పట్టు సాధించేందుకు గట్టిగా ప్రయత్నించానని పిచాయ్ ఇటీవల తెలిపారు.

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఓ రోజు... సుందర్ పిచాయ్... ఓ యువతిని కలిశారు. ఆమెతో స్నేహం చేశారు. ఐతే... అప్పట్లో చాలా మంది స్టూడెంట్స్... వారిద్దర్నీ మంచి జంట అని ఆటపట్టించేవాళ్లు. అంజలీ కోసం సుందర్ ఉన్నాడు అంటూ టీజ్ చేసేవాళ్లు. ఆ తర్వాత ఆమెనే సుందర్ పిచాయ్ పెళ్లి చేసుకున్నారు.

ఐఐటీలో గ్రాడ్యూయేషన్ తరవాత అమెరికా స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో చదివేందుకు స్కాలర్‌షిప్ గెలిచారు పిచాయ్. అక్కడికి వెళ్లేందుకు విమాన టికెట్ రేటు... తన తండ్రి ఏడాది శాలరీ కంటే ఎక్కువే ఉందని పిచాయ్ వివరించారు.
సుందర్ పిచాయ్ ఎదుగుదల :
పిచాయ్... 2004లో GOOGLEలో చేరారు. మొదట్లో ఆయనకు క్రోమ్ ప్రాజెక్ట్ ఇచ్చారు. తన టీమ్‌కి బాగా ప్రేరణ కలిగించిన ఆయన క్రోమ్ బ్రౌజర్ రూపకల్పనలో తిరుగులేని పనితీరు చూపించారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది వాడుతున్న బ్రౌజర్ అదే. క్రోమ్ విజయంతో సుందర్ పిచాయ్... GOOGLE మీడియా, డెవలపర్ ఈవెంట్లలో పాలుపంచుకున్నారు. 2013లో ఆండ్రాయిడ్ డివిజన్‌ని నిర్వహించే బాధ్యతలు ఆయనకు దక్కాయి. ఆ తర్వాత 2015లో ఆయన గుగూల్ సీఈఓ అయ్యారు. కంపెనీని రీస్ట్రక్టర్ చేసినప్పుడు ఆల్ఫాబెట్ అనే మరో సంస్థను సృష్టించారు. ప్రస్తుతం ఆయన ఆల్ఫాబెట్, GOOGLE రెండింటికీ సీఈఓనే.


విద్యార్థులకు రోల్ మోడల్ : భారత్ గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగిన సుందర్ పిచాయ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులకు రోల్ మోడల్. ఇటీవల విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ... ఓపెన్‌గా ఉండండి, రాజీ పడకండి, ఆశను పెంచుకోండి అని పిలుపిచ్చారు. 2020 అనేది మీరు ఏం కోల్పోయారో చెప్పకూడదు.. మీరు ఏం మార్పు తెచ్చారో చెప్పాలి అన్నారు. తద్వారా కరోనాపై దిగాలుగా ఉన్న విద్యార్థుల్లో పిచాయ్ కొత్త ఉత్సాహం నింపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inspiration"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0