Inspiration
ఒకే పాఠశాల నుంచి ఆరుగురు నవోదయకు ఎంపికనచ్చజెప్పి బడికి తీసుకొచ్చేవాణ్ని ...
మా బడిలో చదివే వారంతా నిరు పేద కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు పిల్లలను సక్రమంగా పాఠశాలకు పంపించే వారు కాదు . వారందరికీ నచ్చజెప్పి బడికి వచ్చేలా చేయగలిగాను . బడి వేళలతో పాటు సాయంత్రం పూట అదనంగా పాఠాలు చెప్పేవాన్ని . ఆరుగురు విద్యార్థులు నవోదయకు ఎంపికవడం .. అది కూడా మూడు జనరల్ కేటగిరిలో , మరో మూడు రిజర్వేషన్ కోటాలో రావడం నా కష్టం ఫలించింది . ఈ అవకాశాన్ని పిల్లలు సద్వి నియోగం చేసుకుని ఉన్నత స్థానాలు చేరు కుంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది .
- ఓవీఎస్ నాగరాజు , హెచ్ఎం , ఎంపీపీఎస్ ( ఎఈ ) , గోవిందపురం
అంకితభావం ..పేద విద్యార్థులకు వరం
ప్రతిభకు ప్రోత్సాహం అందిస్తే అవకా శాలను అందిపుచ్చుకోవచ్చని నిరూపించారు చిలక లూరిపేట మండలం గోవిందపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ( ఎఈ) విద్యార్ధులు . పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఓవీ ఎస్ నాగరాజు అంకితభావంతో బోధించడంతో ఇది సాధ్యమైంది . గ్రామంలోని ఎస్సీ కాలనీలోనున్న ఎంపీపీఎస్ ( ఎల్ ఈ ) పాఠశాలలో 35 మంది విద్యార్థులు చదువు కుంటున్నారు . 2018-19 విద్యా సంవ త్సరంలో ఏడుగురు విద్యార్ధులు ఐదో తరగతి పూర్తి చేశారు . వారందరికీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయు డిగా పని చేస్తున్న ఓవీఎస్ నాగరాజు పాఠశాల సమయం పూర్తయిన తర్వాత మరో రెండు గంటలు అదనంగా జవహర్ నవోదయ , ఏపీ రెసి డెన్షియల్ స్కూలు , ఏపీ ఆదర్శ పాఠశాలలో ప్రవేశా లకు నిర్వహించే పరీక్షకు సిద్ధం చేశారు . ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఇచ్చిన శిక్షణతో ముగ్గురు విద్యా ర్థులు నవోదయకు , నలుగురు విద్యార్థులు ఏపీ మోడల్ స్కూలుకు ఎంపికయ్యారు . 2019-20 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో ఉన్న 12 మంది విద్యార్ధులకు శిక్షణ ఇవ్వగా , అందులో ఆరుగురు విద్యార్ధులు అంబడిపూడి జాషువా , కుంభా టోనీ దివ్య , వడ్డాల హర్షకుమార్ , అంబడిపూడి మరి యమ్మ , తురకా మెర్సీ , కుంభా శ్రీలత జవహర్ నవోదయ విద్యాలయకు ఎంపికయ్యారు .
0 Response to "Inspiration"
Post a Comment