Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Meeting with teacher unions on transfers and adjustments tomorrow

బదిలీలు , సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాలతో రేపు భేటీ
 తొమ్మిది గుర్తింపు సంఘాలకు ఆహ్వానం అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులకే అనుమతి.

అమరావతి : ఉపాధ్యాయుల బదిలీలు ,సర్దుబాటు సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరిం చింది . వచ్చే నెల ఒకటిన ( జూలై 1 ) రాష్ట్రంలో గుర్తింపు పొందిన తొమ్మిది ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నది . విజయవాడలోని సమగ్ర శిక్షణ కార్యాలయంలో రోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ ( జేడీ , సర్వీసెస్ ) డీ దేవానందరెడ్డి తెలిపారు . ఈ మేరకు ఆయా సంఘాలకు సోమవారం లేఖలను పంపించారు . వచ్చే నెలలో నిర్వహించనున్న బదిలీలకు ముందే రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది . అందులో భాగంగానే ఇటీవల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు , ఇతర అధికారులు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .

 రేషనలైజేషన్ పై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం పై సంఘాలు భగ్గుమన్నాయి . ఇదే అంశంపై ఈ నెల 28 న ' గురువుల కొలువుల్లో ఎసరు ' అనే శీర్షికన ' విశాలాంధ్ర'లో వార్త ప్రచురితమైంది . ఈ వార్తకు స్పందించిన పాఠశాల విద్య కమిషనర్ వీ చిన వీరభద్రుడు ఉపాధ్యాయ సంఘాలతో బదిలీలు టీచర్ల సర్దుబాటుపై చర్చించాలని నిర్ణయించారు. అయితే , సంఘాలకు ఆహ్వానాలు పంపించలేదు .STU, UTF , APTF( 1938 ) , APTF ( 257 ) , AP HM ల సంఘం , APUS , AP ప్రాథమిక టీచర్ల  సంఘం , PRTU రెండు గ్రూపులకు విద్యాశాఖ నుంచి ఆహ్వానాలు అందాయి . విద్యాశాఖ నిర్వహించే సమాశానికి ప్రతి సంఘం అధ్యక్షుడు , ప్రధాన కార్యదర్శి మాత్రమే హాజరుకావాలని జేడీ దేవానందరెడ్డి స్పష్టం చేశారు . సమావేశంలో ప్రధానంగా ఉపాధ్యాయుల బదిలీలు , సర్దుబాటుపైనే చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది .

బదిలీలకు ముందే నిర్వహించే సర్దుబాటు ప్రక్రియలో ఈ ఏడాది ప్రభుత్వం మార్పులు చేసింది . విద్యార్థులు , ఉపాధ్యాయ నిష్పత్తిని 1:30 చేసింది . అలాగే ఎల్ఎస్ఎల్ హెచ్ఎంలను సెకండరీ గ్రేడ్ టీచర్స్ గా ( ఎపీటీ ) గుర్తించాలని నిర్ణయించింది . దీనివల్ల సుమారు పది వేల ఎక్స్ట్రీటీ పోస్టులకు ప్రమాదం పొంచి ఉంది . ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై అన్ని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి . ఇప్పటికే నాడు- నేడు పనులలో సంఘాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్న ప్రభుత్వం , ఏకపక్షంగా బదిలీలు చేపడితే మరిన్ని విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది . దీంతో తప్పనిసరి పరిస్థితులలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై బదిలీలు , సర్దుబాటుపై చర్చించాలని నిర్ణయించింది . సమావేశం అనంతరం బది లీలు , రేషనలైజేషన్ షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Meeting with teacher unions on transfers and adjustments tomorrow"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0