Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Model tests are being conducted to educate students on the new approach to tenth class examinations.

టెన్త్‌ మోడల్‌ టెస్ట్‌లు.

 పదో తరగతి పరీక్షలకు సంబంధించిన కొత్త విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పిం చేందుకు మోడల్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు.
 కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలను జూలై 10 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెన్త్‌లో 11 పరీక్షలు ఉండగా వాటిని ప్రభుత్వం ఆరుకు కుదించింది. హిందీ మినహా మిగిలిన సబ్జెక్టులలో రెండేసి పేపర్లకు బదులు ఒక్క పేపర్‌ నిర్వహిస్తున్నారు. ఒకేసారి రెండు పేపర్లు రాయడ మంటే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులో భయాన్ని పోగొట్టడంతో పాటు వారికి అవగాహన కల్పించేందుకు మోడల్‌ పరీక్షలు జరుపుతున్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు కొత్తగా రూపొందించిన ప్రశ్న పత్రాల తరహాలోనే ఈ మోడల్‌ టెస్ట్‌లు ఉంటున్నాయి. రాష్ట్రంలో తొలుత కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ మోడల్‌ టెస్ట్‌లు గురు వారం నుంచి ప్రారంభమ య్యాయి. తొలి రోజున విద్యార్థులు తెలుగు పేపర్‌ పరీక్ష రాశారు. పరీక్ష ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహిం చారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు రూపొందించిన మోడల్‌ ప్రకారం జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు (డీసీఈబీ) టెన్త్‌ విద్యార్థుల కోసం మోడల్‌ ప్రశ్న పత్రాలు రూపొందించింది. ఆ ప్రశ్న పత్రాలను వాట్సాప్‌ల ద్వారా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యా యులకు పంపించారు. వాటిని వాట్సాప్‌ ద్వారానే విద్యార్థులకు పంపించి, నిర్దేశిత సమయంలో ఇళ్ల వద్దే మోడల్‌ టెస్ట్‌లు జరిపారు. పరీక్ష ముగిసిన వెంటనే అందుకు సంబంధించిన ‘కీ’ని వాట్సాప్‌ ద్వారా పంపించి వాల్యూయేషన్‌ చేయిస్తున్నారు. దీనివల్ల వచ్చే నెలలో నిర్వహించే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా హాజరవుతారని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మొబైల్స్‌ ఉండటంతో వారికి వాట్సాప్‌ ద్వారా ఎప్పటికపుడు మోడల్‌ టెస్ట్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఉపాధ్యాయులు చేరవేస్తున్నారు. మారుమూల గ్రామాల విద్యార్థులలో కొందరికి మొబైల్స్‌ లేకపోవడంతో, తోటి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కొవిడ్‌ – 19 నిబంధనల ప్రకారం మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు రాయిస్తున్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లోనూ టెన్త్‌ విద్యార్థులు నిర్ణీత సమయంలోనే పరీక్షలు రాసి, ఆ సమాచారాన్ని సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు తెలియజేశారు. ఇళ్ల వద్దే మోడల్‌ పరీక్షలు రాయించడం వల్ల, పబ్లిక్‌ పరీక్షలలో మాల్‌ ప్రాక్టీస్‌కు అవకాశం ఉండదని సీనియర్‌ ఉపాధ్యా యులు వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త విధానంలో పరీక్షల నిర్వహణ, మోడల్‌ ప్రశ్నపత్రాలపై ఇప్పటికే విద్యార్థులకు అవగాహన కల్పించారు. మోడల్‌ టెస్ట్‌లకు తొలి రోజునే మంచి స్పందన లభించింది. ఇదేరీతిలో ఇతర జిల్లాల్లోనూ విద్యాఖాధికారులు మోడల్‌ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Model tests are being conducted to educate students on the new approach to tenth class examinations."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0