Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New Education Systam new syllabus


  • ఏటేటా పరీక్షల కిక ఫుల్‌స్టాప్ ! 
  • కొత్త చదువులు కొత్త సిలబస్
  • LKG నుండే భారీగా ఆన్లైన్ తర్ఫీదులు 
  • జాతీయ పోటీ పరీక్షలే లక్ష్యంగా సిలబస్ 
  • భారతీయ విద్యా విధానంలో కొత్త మలుపులు 

New Education Systam new syllabus

ప్రపంచ వ్యాప్తంగా పిల్లల విద్యావ్యవస్థలో పలు మార్పులొచ్చేస్తున్నాయి . గతంలో ప్రతి ఏటా పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారినే పై తరగతులకు పంపేవారు . తర్వాత 7 , 10 వ తరగ తులకు మాత్రమే నిబద్ధతతో కూడిన పరీక్షల్ని నిర్వహిస్తున్నారు . ఇప్పుడు ప్లస్ 2 వరకు కూడా పరీ క్షలో పనిలేకుండా పై తరగతుల కు ప్రమోట్ చేస్తున్నారు . ఇంటర్ లేదా ప్లస్ 2 అనంతరం నిర్వహించే జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విద్యార్థి చూపే ప్రతిభనే ఇప్పుడు విద్యార్థి మేథస్సుకు కొలమానం గా భావిస్తున్నారు . దీంతో ఇప్పుడు ప్రాధమిక , మాధ్యమిక స్థాయి నుంచి విద్యాసంస్థలు తమ పాఠ్యాంశాల్ని , సిలబస్ ను తమకు తామే రూపొందించుకుని నిర్వహించే 
పరిస్థితులేర్పడ్డాయి . విద్యార్థుల భవిష్యత్ అవసరాలకనుగుణంగా వీటిని రూపుదిద్దుతున్నారు . ఎల్ కేజి స్థాయిలోనే పిల్లల ఆలోచనాశక్తి , మేథస్సును అంచనాలేసేస్తున్నారు . దీంతో పాటు వారి తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్ పట్లగల దృక్పధాన్ని , ఆర్ధిక సామర్థ్యాన్ని కూడా ఇంటర్వ్యూల రూపంలో లెక్కలేస్తున్నారు . పాఠశాలల విద్యావిధానం ఇకముందు తగ్గిపోనుంది . ఆన్లైన్ విద్యా విధానమే ప్రధానంగా మారనుంది . ఈ ఆన్లైన్ విధానంలో బోధించాల్సిన పాఠ్యాంశాల్ని ఎవరికి వారు రూపొందించుకుంటారు . ఐఐటీలు , ఐఐఎమ్లు , ఇతర అత్యున్నత విద్యాసంస్థల్లో సీట్లు పొందే స్థాయిలో పిల్లల్ని రూపుదిద్దేందుకు అవసరమైన సిలబస్ ను మాత్రమే ఇకముందు వీరు అనుసరించనున్నారు . 

భవిష్యత్ పట్ల పిల్లల్లో కూడా ఇప్పుడో స్పష్టత కనిపిస్తోంది . అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల చిన్న నాటి నుంచే వారి భవిష్యత్ పై కలలు గంటున్నారు . అందుకు అవసరమైన ఆర్ధిక సంపత్తిని సిద్ధం చేస్తున్నారు . విద్యకోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వీరు వెనుకాడ్డం లేదు . తమ పిల్లలు , ఇంజనీర్లు , డాక్టర్లు , సివిల్ సర్వీస్ , మిలటరీ లేదా ఇతర ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డం కోసం ఎలాంటి త్యాగాలకైనా వీరు సిద్ధపడుతున్నారు . ఇప్పటి వరకు ప్రముఖ లేదా పేరెన్నికగన్న విద్యావ్యవస్థల్లో సీట్లు పొందేందుకీ తల్లిదండ్రులు ప్రాధాన్యతనిచ్చేవారు . కానీ ఇప్పుడు అత్యున్నత విద్యాసంస్థల్నుంచి ఆన్లైన్ కోచింగ్ ఇప్పించేందుకు ప్రయత్నించనున్నారు . అటు విద్యాసంస్థలు , ఇటు తల్లిదండ్రుల తీరులో కూడా ఈ మార్పు గోచరిస్తోంది . ప్రభుత్వాలు కూడా ఇందు కనుగణంగానే తన విధానాల్ని మార్చుకుంటున్నాయి . ఏటేటా నిర్వహించే పరీక్షల్ని పక్కన పెడుతున్నాయి . నేరుగా ఉన్నత విద్యావ్యవస్థల ప్రవేశానికుద్దేశించే జాతీయ స్థాయి పోటీ పరీక్షలే లక్ష్యంగా నిలబస్ ను సిద్ధం చేస్తున్నాయి . పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో పాటు గ్రామీణ స్థాయిలోని విద్యాసంస్థల్లో కూడా ఇప్పుడు ఎల్ కెజి నుంచే ఎమ్ సెట్ ఓరియంటేషన్ , సివిల్ సర్వీస్ ఓరియంటేషన్ అంటూ ఈ విద్యార్ధులు ఎప్పుడో రాయబోయే ఎమ్ సెట్ , యుపిఎసి పరీక్షలకు ఇప్పట్నుంచే తర్ఫీదును మొదలెట్టాయి . దీంతో ప్రాధమిక , మాధ్యమిక విద్యావ్యవస్థలో ఇకముందు సమూల మార్పులు రానున్నట్లే . కాగా ఇప్పటికే విదేశీ విద్యాసంస్థలు , దేశీయ అతిపెద్ద విద్యావ్యవస్థలు ఆన్‌లైన్ విధానానికి సిద్ధమయ్యాయి . భారత్ నుంచి ఏటా లక్షలాది మంది విదేశాల్లోని పలు వర్శిటీల్లో సీట్ల కోసం పోటెత్తేవారు . కాగా ఇప్పుడు భారత్ కు చెందిన విద్యార్ధుల్ని తమ ఆన్లైన్ విద్యావ్యవస్థల్లో భాగస్వామ్యం చేసేందుకు విదేశీ విశ్వవిద్యాలయాలు పెద్దెత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి . వీరికనుగుణమైన రీతిలో ఫీజుల్ని నిర్దేశించి ఆకర్షిస్తున్నాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New Education Systam new syllabus"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0