Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

No Finals, No Entrance, Only Admissions


  • నో ఫైనల్స్, నో ఎంట్రన్స్,ఓన్లీ అడ్మిషన్స్
  • ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టెన్ , ఇంటర్ పరీక్షలు రద్దు 
  • గ్రేడ్లు ప్రకటించి ప్రమోషన్
  • కీలక ప్రవేశ పరీక్షలు రద్దు 
  • తరగతి మార్కుల ఆధారంగా సీట్లు  
  • ఆలస్యంగానైనా విద్యాసంవత్సరం 
  • ప్రయివేటు విద్యాసంస్థలకూ ఊతం 
  • యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం
No Finals, No Entrance, Only Admissions

కోవిడ్ 19 మహమ్మారి విద్యార్థుల భవి తవ్యంతో కూడా ఆట్లాడుతోంది . దేశంలోని వివిధ ప్రముఖ విశ్వవిద్యాలయాలు , వివిధ బోర్డులు నిర్వ హించే పరీక్షలు రద్దవుతున్నాయి . ప్రస్తుత పరి స్థితుల్లో వీటిని నిర్వహించలేని దుస్థితి ప్రభుత్వా లకు , విశ్వవిద్యాలయాలకు , బోర్డులకు నెలకొంది . ఇప్పటికే ఒడిషా , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా , మహ రాష్ట్ర మరియు తమిళనాడు ప్రభుత్వాలు 10 వ తరగతి , ప్లస్ 2 పరీక్షల్ని రద్దు చేశాయి . తరగతుల్లో నిర్వహించే అభ్యాస పట్టికల మూల్యాంక మార్కులకనుగుణంగా విద్యార్ధు లకు గ్రేడ్లు ప్రకటిస్తూ వారిని పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నాయి . కాగా దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది . పాఠశాలలు , కళాశాలలు , విశ్వవిద్యాలయాల  స్థాయిలో అనేక పరీక్షలు రద్దు చేయబడుతున్నాయి . కీలక కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలు కూడా రద్దవుతున్నాయి . ప్రస్తుత తరగతుల మార్కుల ప్రాతిపదికగానే ఈ కోర్సుల్లో సీట్ల కేటాయింపునకు ప్రభుత్వాలు సంసిద్ధమౌతున్నాయి . మహరాష్ట్రలో డిగ్రీ , పోస్టు గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది పరీక్షలు కూడా రద్దు చేశారు .

 పరీక్షల్లేకుండానే విద్యార్ధుల్ని ఉత్తీర్ణుల్ని చేశారు . మహారాష్ట్ర సిబిఎస్ఇ 12 వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి . జెఇఇ మెయిన్ 2020 పరీక్షల్ని రద్దు చేస్తున్నారు . నీట్ 2020 పరీక్షల తేదీని ఇప్పటికే పలుమార్లు వాయిదా వేశారు . ఇవి కూడా రద్దయ్యే జాబితాలో చేరిపోయాయి . బిట్సాట్ 2020 రద్దయింది . నాటా 2020 పరీక్షల్ని నిలిపేశారు . క్లాట్ 2020 ని ఆపేశారు . ఎన్‌సిహెచ్ఎమ్ జెఇ 2020 రద్దయింది . ఎఐఎపిజిఇటి 2020 కూడా రద్దు చేశారు . మేట్ 2020 ని రద్దు చేసేందుకు యోచిస్తున్నారు . త్రిపుర బోర్డు నిర్వహించే 10 , 12 తరగతుల పరీక్షల్ని రద్దు చేసింది . బీహార్ బిసిజన్న 2020 పరీక్షల్ని ఈ ఏడాది నిలిపేస్తు న్నట్లు ప్రకటించింది . గోవాలో అన్ని రకాల పరీక్షల్ని నిలిపేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది . హిమాచల్ ప్రదేశ్ లో అన్ని రకాల పరీక్షల్ని రద్దు చేశారు . మేఘాలయలో ఇప్పటికే 12 వ తరగతి పరీక్షల్ని రద్దు చేస్తున్నట్లు ప్రక టించారు . ఒడిషాలో యుజి , పిజి కోర్సులకు ప్రకటిం చిన పరీక్షల షెడ్యూల్ ను రద్దు చేశారు . నాగపూర్ విశ్వవిద్యాలయ పరీక్షలన్నింటిని రద్దు చేసింది . కర్ణా టకలో ఎస్ఎస్ఎసి పరీక్షలు రద్దయ్యాయి . పియుని పరీక్షలు కూడా రద్దుకానున్నాయి . ఐఐటి కాన్పూర్ తన యుణి , పిజి పరీక్షల్ని రద్దు చేసింది . ఉత్తరాఖండ్ 10 , 12 వ తరగతుల పరీక్షల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసు కుంది . ఇసిఎస్ఆ , ఇఎన్ని పరీక్షలు కూడా రద్దయ్యాయి . తమిళనాడులో 10 , 12 వ తరగతి పరీక్షలు నిల్చిపో యాయి . రాజస్థాన్ విశ్వవిద్యాలయం అన్ని పరీక్షల్ని ఆపేస్తున్నట్లు ప్రకటించింది . పశ్చిమబెంగాల్ లోని జెకె బోస్ బోర్డ్ పరీక్షలు రద్దయ్యాయి . చత్తీ ఫుడ్ 10 , 12 వ తరగతి పరీక్షల్ని నిలిపేసింది . మధ్యప్రదేశ్ లో అన్ని విశ్వవిద్యాలయాలు , కళాశాలల్ని ఇప్పట్లో తెరిచేది లేదని ప్రకటించింది . ముంబయ్ విశ్వవిద్యాలయం యొక్క ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విభాగం అన్ని పరీక్షల్ని రద్దు చేసింది . బీహార్ లో బుజెట్ రద్దయింది . దేవి 2020 రద్దయింది . విఇడి , సిఇటి పరీక్షల్ని రద్దు చేశారు . అలీఘర్ ముస్లీం విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష అహల్య విశ్వవిద్యాలయం పరీక్షల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది . బీహార్ డిఎఎడ్ జాయింట్ ఎంట్రన్స్ పరీక్షను రద్దు చేసింది . ఎమ్ హెడ్స్ , సిఇటి 2020 పరీక్షలు నిల్చిపోయాయి . కుసాట్ క్యాట్ 2020 పరీక్ష రద్దయింది . ఉత్తర్ ప్రదేశ్ బిఎడ్ జెఇ 2020 రద్దు చేసింది . ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్ ఎస్ఎల్ బి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎమ్ హెచ్ , సిఇటి లాసెట్ 2020 ని రద్దు చేశారు . వీటి 2020 రద్దయింది . ఇఎస్ఎల్‌యు ప్రవేశ పరీక్షను రద్దు చేశారు . అలహాబాద్ విశ్వవిద్యాలయ పిజి పరీక్షల్ని రద్దు చేస్తూ నిర్ణయించారు . కేరళ సెట్ 2020 రద్ద యింది . మహరాష్ట్రలో బిఇడి , ఎమ్ ఇడి , బిటిఇడి , ఎమ్ పిఇడి పరీక్షల్ని రద్దు చేశారు . ఇవేకాదు . ఐటిడిపి రిక్రూట్‌మెంట్ పరీక్షల్ని రద్దు చేశారు . ఆర్బిఐ అసిస్టెంట్ మెయిన్ పరీక్షను రద్దు చేశారు . కేరళ పిఎస్సి రిక్రూట్‌మెంట్ పరీక్షను రద్దు చేశారు . బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక పరీక్షను రద్దు చేశారు . ఢిల్లీ హయ్యర్ జ్యూడిషియల్ సర్వీసెస్ మెయిన్స్ 2019 పరీక్షల్ని రద్దు చేశారు . ఎఐఐఎమ్ జి పిజి పరీక్షల్ని రద్దు చేశారు . కెఇపిఎమ్ 2020 పరీక్షలు రద్దయ్యాయి . లబ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం , అమిటి విశ్వవిద్యా లయం , జెఇసిఆర్ సి విశ్వవిద్యాలయాల పరీక్షలు రద్దు చేశారు . ఎస్ఏడి , డిఎటి 2020 రద్దయింది . ఎఎజి నీట్ , యుజిసి నెట్ , సిమేట్ , జిపాట్ , డ్యూయెట్ , జెఎన్‌యు ఇఇ పరీక్షలు రద్దయ్యాయి . బెనారస్ హిందూ యూనివర్శిటీకి చెందిన యుఇటి , పిఇటి పరీక్షల్ని రద్దు చేశారు . ఇవన్నీ ఈ ఏడాదికి ఇక లేనట్లే . అయితే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు , కళాశాలలు , సాంకేతిక విద్యా సంస్థలు ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటు న్నాయి . దీంతో పాటు విద్యార్ధులు కూడా విద్యాసంవ త్సరాన్ని వృధా చేసుకునేందుకు సిద్ధంగా లేరు . ఈ రెండు సమస్యల పరిష్కారానికి ఇప్పటికే తరగతుల్లో నిర్వహించిన వివిధ పరీక్షల్లో మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించి ఈ ఏడాది ఆలస్యంగానైనా విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది . తద్వారా అటు విద్యాసంస్థలు , ఇటు విద్యార్ధుల ప్రయోజనాల్ని పరిరక్షించాలని ఆశిస్తోంది .



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "No Finals, No Entrance, Only Admissions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0