No matter who is in the area .... they can watch the solar eclipse
ఎవరు ఏ ప్రాంతం వారో.... వారు గ్రహణ కాల ప్రమాణాన్ని చూసుకోగలరు.
జూన్ 21న ఆదివారం ఖగోళంలో అద్భుత సంఘటన జరగబోతుందని ప్లానిటరీ సొసైటీ సైంటిస్ట్ రఘునందన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దశాబ్దంలో మొట్టమొదటిసారిగా కంటికి కనిపించే జ్వాలావలయ సూర్యగ్రహణం ఆదివారం ఏర్పడనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇది రేపు ఉదయం 9.116 గంటలకు ఏర్పడి, మధ్యాహ్నం 3.04 వరకూ సూర్య గ్రహణం ఉంటుంది. కాగా మన దేశంలో ఈ సూర్య గ్రహణాన్ని మొదటిగా గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో చూస్తారు. ఇది కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనబడదు. సూర్య గ్రహణం కారణంగా రేపు అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమి మీద పడతాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఈ గ్రహణం ఉదయం 10.21 గంటల నుండి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం ఉంటుంది. తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుండి 1.44 వరకు 51 శాతం గ్రహనం ఉంటుందని తెలిపారు. మరోవైపు గ్రహణ సమయంలో తినకూడదు, గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు అని మూఢనమ్మకాలు ప్రచారం చేస్తున్నారు
ఇవన్నీ అవాస్తవాలు.. ఇలాంటివి నమ్మకూడదని స్పష్టం చేశారు సైంటిస్ట్ రఘునందన్.
0 Response to "No matter who is in the area .... they can watch the solar eclipse"
Post a Comment