Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

One nodal officer for each Secretariat Reports on weekly secretariat performance

ప్రతి సచివాలయానికి ఒక నోడల్ అధికారి
వారం వారం సచివాలయ పనితీరుపై నివేదికలు
One nodal officer for each Secretariat  Reports on weekly secretariat performance

వార్డు అడ్మిన్ మొదలుకొని మహిళా సంరక్షణ కార్యదర్శి పనితీరు పరిశీలన
నివేదికలు ఆధారంగా నిర్ణయాలు తీసుకోనున్న అధికారులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మున్సిపల్ పరిపాలనశాఖ చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం వార్డు సచివాలయాల ద్వారా మున్సిపాలిటీలకు సంబంధించి 59 రకాల సేవలు ప్రజలకు అందుతున్నాయి. ఆ సేవలు మరింత పకడ్బందీగా అందించేందుకు ప్రతి వార్డు సచివాలయానికి ఒక నోడల్ అధికారిని నియమించనున్నారు.
ఒక్కో వార్డు సచివాలయంలో ఎనిమిది విభాగాలకు సంబంధించి కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు.
సచివాలయం లో సేవలు
  1. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ,
  2. వార్డు ఎమినిటీస్ సెక్రెటరీ,
  3. వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ
  4. వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ,
  5. వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ,
  6. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ,
  7. వార్డు హెల్త్ సెక్రటరీ,
  8. వార్డు మహిళ సంరక్షణ సెక్రటరీల
సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు.
అయితే వార్డు సచివాలయాల ద్వారా అందించే సేవల్లో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా, నిర్ణీత కాల వ్యవధిలో ప్రజలకు అందేలా చూసేందుకు తొలిసారిగా నోడల్ అధికారులను నియమించనున్నారు.
ప్రతి వారు సచివాలయానికి ఒకరు చొప్పున నోడల్ అధికారిని నియమించనున్నారు.
జూనియర్ అసిస్టెంట్ మొదలుకొని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరకు నోడల్ అధికారులుగా నియమించనున్నారు.
ఒకే ప్రాంగణంలో రెండు సచివాలయాలు ఉంటే ఆ రెండింటికి కలిపి ఒక నోడల్ అధికారిని నియమించనున్నారు. వీటిపైనే నివేదికలు వార్డు సచివాలయాలకు సంబంధించి కార్యదర్శుల విధి విధానాలను పర్యవేక్షిస్తూ మరింత పకడ్బందీగా అందించేందుకు వీలుగా వారంవారం నోడల్ అధికారి నగర పాలక సంస్థ కమీషనర్‌కు నివేదికలు అందించనున్నారు.
కమిషనర్ నుంచి మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ కు, అక్కడ నుంచి డైరెక్టర్‌కు నివేదికలు వెళ్ల నున్నాయి

1.వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ
వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీకి సంబంధించి అటెండెన్స్ రిజిస్టర్, సీఎల్ రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్, గ్రీవెన్స్ రిజిస్టర్, టర్న్ డ్యూటీ రిజిస్టర్, తపాల రిజిస్టర్, పర్సనల్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, ఎంఎల్ బుక్, మెయింటెనెన్స్ ఆఫ్ క్యాష్ బుక్, మెయింటెనెన్స్ ఆఫ్ మీ సేవా సర్వీస్ క్యాష్ బుక్, సీఎం పేషీ రిజిస్టర్, హయ్యర్ ఆఫీసర్స్ లెటర్స్ రిజిస్టర్స్, విజిటర్స్ రిజిస్టర్స్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ సర్వీస్ రిక్వస్టడ్ ఫామ్స్, స్పందన అర్జీలు, రెవెన్యూ కలెక్షన్ తదితర వాటిని నిర్వహించాల్సి ఉంటుంది.
2.వార్డు ఎమెనిటీస్ సెక్రటరీ
వార్డు ఎమెనిటీస్ సెక్రటకు సంబంధించి వాటర్ శాంపిల్స్ టెస్టెడ్, పైపులైన్ లీకేజీ, ఓపెన్ డ్రెయిన్స్ చెకింగ్, స్ట్రీట్ లైట్స్ రిపేర్, పాట్ హాల్స్ గుర్తింపు, సివిల్ వర్క్స్, గ్రీవెన్స్ పరిష్కారం, వాటర్ ట్యాప్ అప్లికేషన్స్, వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఎన్ని ఇచ్చింది. కనెక్షన్లకు సంబంధించి ఎన్ని అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. అధికారిక కొళాయి కనెక్షన్లు, అనధికారిక కొళాయి కనెక్షన్లు గుర్తించడం, గ్రీవెన్స్ రిజిస్టర్ నిర్వర్తించాల్సి ఉంటుంది.
3.వార్డు శానిటేషన్ సెక్రటరీ
వార్డు కానిటేషన్ సెక్రటరీకి సంబంధించి ఎన్ని ఇళ్లు ఉన్నాయి. ఎన్ని ఇళ్ల ద్వారా చెత్త సేకరణ జరుగుతోంది. వేస్ట్ మేనేజ్ మెంట్ సిస్టం ఏవిధంగా అమలవుతోంది. ఆన్లైన్ వేస్ట్ మేనేజ్ మెంట్ విధానం అమలు, ఎన్ని ఇళ్లకు ఆర్ఏఫ్ఐడీ ట్యాగ్స్ ఉన్నాయి, ఎన్ని వర్కింగ్ లో ఉన్నాయి. ఎన్ని మేజర్ డ్రెయిన్లు, మైనర్ డ్రెయిన్లు ఉన్నాయి. వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయి, వాటికి వ్యాక్సిన్లు వేశారా, మ్యారేజీ రిజిస్ట్రేషన్ రికార్డులు, ట్రేడ్ లైసెన్స్ అప్లికేషన్లు తదితర రిజిస్టర్లు నిర్వర్తించాల్సి ఉంటుంది.
4.వార్డు ప్లానింగ్ సెక్రటరీ
వార్డు ప్లానింగ్ సెక్రటరీకి సంబంధించి ఎన్ని అధికారిక కట్టడాలు ఉన్నాయి. అనధికారిక కట్టడాలు ఎన్ని కొత్తగా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయా, పీఓ నోటీసులు ఎన్ని జారీ చేశారు. సీఓ నోటీసులు ఎన్ని జారీ చేశారు. పార్కింగ్ ప్రాంతాలు ఆక్రమణలకు గురయ్యాయా, ఆక్రమణలు తొలగించడం, నిబంధనలకు విరుద్దంగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఉంటే ఎన్నింటిని తొలగించారు, ఆస్తి పన్ను ఎంత వసూలు చేశారు, బిల్డింగ్ ప్లాన్లు ఎన్ని వచ్చాయి.
ఎన్నింటికి అనుమతి ఇచ్చారు. బిల్డింగ్ లైసెన్స్ ఫీజు, లేబర్ సెస్ ఫీజు, గ్రీన్ ఫీజు తదితర వాటికి సంబంధించి రిజిస్టర్లు నిర్వర్తించాల్సి ఉంటుంది
5.వార్డు వెల్ఫేర్ సెక్రటరీ
వార్డు వెల్ఫేర్ సెక్రటరీకి సంబంధించి వైఎస్సార్ పెన్షన్స్ ఎంతమంది పొందుతున్నారు, స్వయం సహాయక గ్రూపులు ఎన్ని ఉన్నాయి, కొత్తగా ఎన్ని గ్రూపులు ఏర్పడ్డాయి, బ్యాంకు లింకేజీ రుణాలు ఎన్ని గ్రూపులకు వచ్చాయి. ఎన్ని గ్రూపులు బ్యాంకు లింకేజీ రుణాలు చెల్లించాయి, ఎంతమంది వీధి వ్యాపారులు ఉన్నారు. వారిలో ఎంతమంది గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారు, వీధి వ్యాపారుల్లో ఎంతమందికి బ్యాంకు రుణాలు అందాయి. వైఎస్సార్ బీమా దరఖాస్తులు ఎన్ని వచ్చాయి, వైఎస్సార్ పెళ్లి కానుక దరఖాస్తులు ఎన్ని వచ్చాయి తదితర. రిజిస్టర్లను నిర్వర్తించాల్సి ఉంటుంది.
6.వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ
వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీకి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ఎన్నింటిని తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలవుతుందా, నగర సేవా పోర్టర్ ద్వారా వచ్చే గ్రీవెన్స్, జగనన్న విద్యా దీవెన పథకం అమలు, జగనన్న అమ్మ ఒడి పథకం, జగనన్న వసతి దీవెన, స్కాలర్ షిప్ లు ఎంతమంది పొందుతున్నారు. నాడు - నేడు కార్యక్రమం ఎన్ని పాఠశాలల్లో జరుగుతుంది, పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన రిజిస్టర్లు నిర్వర్తించాల్సి ఉంటుంది.
7.వార్డు మహిళా సెక్రటరీ
వార్డు మహిళా సంరక్షణ సెక్రటరీకి సంబంధించి ఎన్ని అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు, ఎంత మంది గర్భిణులను గుర్తించారు, ఎంతమంది బాలింతలను గుర్తించారు. ఆరేళ్లలోపు చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయా, ఎన్నిచోట్ల అందుబాటులో లేవు. వైఎస్సార్ అమృత హస్తం కింద ఎంతమంది లబ్ధి పొందుతున్నారు.
8వైఎస్సార్ సంపూర్ణ పోషణ ఎంతమంది పొందుతున్నారు. పోషక లోపంతో బాధపడుతున్న చిన్నారులు ఎంతమంది ఉన్నారు, బాల్య వివాహాలు ఎన్నింటిని ఆపారు. ఎంత మంది బాల కార్మికులను గుర్తించారు. ఎంతమంది బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించారు, గృహహింస, శారీరక హింసకు గురయ్యే మహిళల సమస్యలపై అవగాహనకు ఎన్ని క్యాంపులు నిర్వహించారు. ఎన్ని పాఠశాలలు, కాలేజీలు సందర్శించి బాలికలు, కిశోర బాలికల హక్కుల గురించి తెలియజేశారు. స్వయం సహాయక సంఘాలతో ఎన్ని సమావేశాలు నిర్వహించారు. అనధికారికంగా ఎన్ని మద్యం దురాణాలు. ఉన్నాయి. బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు తదితర వాటికి సంబంధించి రిజిస్టర్లు నిర్వర్తించాల్సి ఉంటుంది.
8.హెల్త్ సెక్రటరీ
వార్డు హెల్త్ సెక్రటరీకి సంబంధించి వారంలో ఎన్ని గృహాలు సందర్శించారు. యాంటినేటల్ కేసులు రిజిస్టర్డ్ ఆండ్ ఇన్వెస్టిగేటెడ్ ఎంతమందికి ఐఎఫ్ఏ పంపిణీ జరిగింది. ఎంత మంది గర్భవతులు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.ఎన్ని ప్రసవాలకు హాజరైనారు, ఎన్ని బాలింత గృహాలను సందర్శించారు. తక్కువ బరువుతో పుట్టిన శిశువులను ఎంతమందిని రిఫర్ చేశారు. కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు ఎంతమంది చేయించుకున్నారు. టీబీ కేసులు ఎన్ని ఉన్నాయి. డయేరియా, ఎపిడమిక్, కాఫ్, ఫీవర్ కేసులు ఎన్ని ఉన్నాయి, లెప్రసీ, డయాబెటిస్, బీపీతో బాధపడేవారు ఎంతమంది ఉన్నారు. క్యాన్సర్, ఎయిడ్స్ బాధితులు ఎంతమంది తదితర రిజిస్టర్లను నిర్వర్తించాల్సి ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "One nodal officer for each Secretariat Reports on weekly secretariat performance"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0