SBI: SBI warns banking app users
SBI : బ్యాంకింగ్ యాప్ వాడేవారికి SBI వారి హెచ్చరిక
SBI మీరు బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా ? అయితే జాగ్రత్త . మీ బ్యాంకింగ్ వివరాలు కాజేసే మాల్వేర్ కలకలం రేపుతోంది .
SBI మీరు బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా ? అయితే జాగ్రత్త . మీ బ్యాంకింగ్ వివరాలు కాజేసే మాల్వేర్ కలకలం రేపుతోంది .
మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? మీ ఫోన్‌లో బ్యాంకింగ్ యాప్స్ ఉన్నాయా? అయితే జాగ్రత్త అని హెచ్చరిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. కొత్తగా #EventBot అనే ఆండ్రాయిడ్ మొబైల్ మాల్‌వేర్ వేగంగా విస్తరిస్తోందని, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్‌లో కీలక సమాచారాన్ని కొట్టేస్తుందని వార్నింగ్ ఇస్తోంది. ఈవెంట్ బాట్ ఆండ్రాయిడ్ మొబైల్ మాల్‌వేర్ థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ సైట్లలో ఉంటుంది. అంటే మీరు GOOGLE ప్లే స్టోర్ నుంచి కాకుండా ఇతర వెబ్‌సైట్ల నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేసినట్టైతే ముప్పు పొంచి ఉన్నట్టే. అక్కడ మీరు డౌన్‌లోడ్ చేసే యాప్ ద్వారా ఈ డేంజరస్ మాల్వేర్ మీ స్మార్ట్‌ఫోన్‌లో చొరబడుతుంది. ఆ తర్వాత బ్యాంకింగ్ యాప్స్, మనీ ట్రాన్స్‌ఫర్ యాప్స్‌లోని కీలక సమాచారాన్ని కొట్టేస్తుంది.
ఈవెంట్ బాట్ ఆండ్రాయిడ్ మొబైల్ మాల్‌వేర్ ఇప్పటికే అమెరికా, యూరప్‌కు చెందిన 200 బ్యాంకింగ్ అప్లికేషన్స్, మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీసెస్, క్రిప్టో కరెన్సీ వ్యాలెట్స్‌ని టార్గెట్ చేసింది. యాప్స్‌లోని కీలకమైన సమాచారం మాత్రమే కాదు బ్యాంకుల నుంచి వచ్చే ఎస్ఎంఎస్‌లను కూడా కొట్టేస్తోంది. మీ యాప్‌లో టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉన్నా బైపాస్ చేసి మరీ సమాచారాన్ని కొట్టేయగల డేంజరస్ మాల్‌వేర్ ఇది. ఈ మాల్‌వేర్ ఇప్పటివరకైతే GOOGLE ప్లేస్టోర్‌లో కనిపించలేదు. కానీ థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడింగ్ సైట్‌లో ఉంటుంది. ఈ మాల్‌వేర్ ఉన్న యాప్ డౌన్‌లోడ్ చేయడానే అన్ని పర్మిషన్లు తీసుకుని డేటాను కొట్టేస్తుంది. మీ బ్యాంకింగ్ యాప్స్‌కు సంబంధించిన డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిందంటే మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ కావడం ఖాయం.
0 Response to "SBI: SBI warns banking app users"
Post a Comment