Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Teachers are in Schools for students doubts clarification

బడుల్లో మాస్టర్లుంటారు..
సందేహాలను నివృత్తి చేయటమే లక్ష్యంగా కార్యాచరణ.

Teachers are in Schools for students doubts clarification

వేసవి సెలవుల అనంతరం జూన్‌ 12న ప్రారంభం కావలసిన పాఠశాలలు కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆగస్టు 3కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో బోధనకు శ్రీకారం చుట్టాయి. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు బడులు ఆలస్యంగా ప్రారంభమైనా విద్యార్థులకు ఆ ప్రభావం లేకుండా చర్యలు తీసుకుంది. తాము అందుకు ఏ మాత్రం తీసిపోమనేలా సర్కారీ పాఠశాలల్లో పనిచేసే గురువులు ఇళ్ల నుంచి లేదా పాఠశాలకు వచ్చి వారికున్న సందేహాలను నివృతి చేయాలనే ఆదేశాలు వెలువడ్డాయి. ఇది ఉపాధ్యాయులకు ఐచ్ఛికమేనని(ఆప్షనల్‌) పైకి చెబుతున్నా అంతర్గతంగా మాత్రం హాజరుకానివారిపై చర్యలు తీసుకుంటారనే అభిప్రాయం ఉపాధ్యాయవర్గంలో బలంగా వినిపిస్తోంది. మొత్తానికి సర్కారీ పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచనుండటంతో పిల్లలు వారి సేవలను ఏ మేరకు వినియోగించుకుంటారనేది పరిశీలించాల్సిన విషయం.
పిల్లలు ఎవరైనా తమ సందేహాలను నివృతి చేసుకోవటానికి, ఇంటి వద్ద చదివిన పాఠ్యాంశాలను తిరిగి అప్పజెప్పటానికి పాఠశాలలకు వస్తే వారికి అందుబాటులో ఉండాలనేది సర్కారు భావన. ఈనెల 12 నుంచి పాఠశాలలకు వెళ్లాలని ఉపాధ్యాయులను ఆదేశించటంపై ఉపాధ్యాయుల్లో చర్చ జరుగుతోంది. దీన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించినా యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదు..ఎంఈఓ, డీవైఈఓ, ఏడీలను స్కూళ్లకు పర్యటించాలని ఆదేశిస్తున్నారు. ఉపాధ్యాయులతో పాటు వారి వద్దకు పిల్లలు ఎందరు వస్తున్నారో ఆ వివరాలను సేకరిస్తున్నారు. యంత్రాంగమే పాఠశాలలకు వచ్చి పరిశీలిస్తోందని తెలుసుకుని సగటున ప్రతి ఉపాధ్యాయుడు కరోనా సమయంలోనూ రవాణా సౌకర్యం అంతంతే అందుబాటులో ఉన్నా పాఠశాలలకు వెళ్లకతప్పటం లేదు. తగు జాగ్రత్తలు తీసుకోకుండా పిల్లలు వస్తే  ఆ ప్రభావం పలు రకాలుగా ఉంటుందని ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. . దీంతో విద్యాశాఖ అధికారులు కూడా ప్రతి పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు అందరూ ఒకే రోజు రాకుండా వంతుల వారీగా రావాలని సలహానిస్తున్నారని తెలుస్తోంది. పిల్లలు ఎవరైనా తమ సందేహాలను నివృతి చేసుకోవటానికి వచ్చినప్పుడు వారికి అందుబాటులో ఉండకపోతే తమపై ఏమైనా చర్యలు తీసుకుంటారేమోనని ఆందోళన చెందిన సగటు ఉపాధ్యాయుడు పాఠశాలల  బాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Teachers are in Schools for students doubts clarification"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0