The central cabinet is key decisions
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ఈరోజు ప్రధాని మంత్రి మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈరోజు ప్రధాని మంత్రి మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
- అందులో ముఖ్యంగా సహకార బ్యాంకులను అర్బీఐ పరిధిలోకి తెస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం. దీంతో అర్బీఐ పరిధిలోకి 58 సహకార బ్యాంకులు.
- దేశ వ్యాప్తంగా 1,540 సహకార బ్యాంకులు అర్బీఐ పరిధిలోనికి తెస్తూ ఆర్డినెన్స్ ను ఆమోదించిన కేంద్ర క్యాబినెట్.
- మొత్తం 8 కోట్ల 60 లక్షల డిపాజిటర్ ల డిపాజిట్ లకు భద్రత.
- కొత్తగా సృష్టించిన "ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్" (IN-SPACe) ద్వారా భారతీయ అంతరిక్ష మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడానికి ప్రైవేట్ సంస్థలకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం.
- ఈ నిర్ణయంతో అంతరిక్ష కార్యకలాపాలలో ప్రైవేట్ పరిశ్రమలను ప్రోత్సహించడం, మరియు మార్గనిర్దేశం చేస్తుందన్న కేంద్ర మంత్రి జితేందర్ సింగ్.
- ప్రధాన్ మంత్రి "ముద్ర" యోజన (పిఎంఎంవై) కింద "శిశు" లోన్ కేటగిరీ రుణగ్రహీతలకు 2 శాతం వడ్డీని తగ్గించే పథకాన్ని ప్రధాని మోడి అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆమోదం.
- 2020 మార్చి 31 నాటికి అర్హత ఉన్న రుణగ్రహీతలకు 12 నెలల కాలానికి రుణాలు మంజూరు.
- ఇతర వెనుకబడిన వర్గాలలో ఉప వర్గీకరణ సమస్యను 6 నెలల్లో, అంటే 31.1.2021 వరకు, పరిశీలించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం ఏర్పాటు చేసిన కమిషన్ పదవీకాలాన్ని పొడిగించడానికి ప్రధాని మోడి అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆమోదం.
- ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్పు
- అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి
- ఓబీసీ కులాల వర్గీకరణ కమిటీ గడువు మరో 6 నెలలు పొడిగింపు, జనవరి 31, 2021 కల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశం
- పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటుకు ఆమోదం
0 Response to "The central cabinet is key decisions"
Post a Comment