Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

UPSC Jobs: 413 jobs in defense, Navy

UPSC Jobs : డిఫెన్స్ , నేవీలో 413 ఉద్యోగాలు ... ఇంటర్ పాసైతే చాలు
UPSC Jobs: 413 jobs in defense, Navy

UPSC NDA & NA Exam ( 11 ) 2020  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ కలా ? ఆర్మీ , నేవీలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా ? 413 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది . పూర్తి వివరాలు తెలుసుకోండి .

ఆర్మీలో ఉద్యోగం చేయడం మీ కలా? డిఫెన్స్‌లో పనిచేయాలనుకుంటున్నారా? నేవీలో ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారా? మీకు శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ-NDA, నావల్ అకాడమీ-NA ఎగ్జామినేషన్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతీ ఏడాది రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తూ ఉంటుంది యూపీఎస్‌సీ. గతంలోనే 418 పోస్టుల భర్తీకి ఎన్‌డీఏ ఎన్ఏ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికే పరీక్ష జరగాల్సి ఉండగా కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఎన్‌డీఏ ఎన్ఏ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు నోటిఫికేషన్లకూ ఒకేసారి సెప్టెంబర్ 6న పరీక్ష నిర్వహించనుంది. పరీక్ష ఒకేసారి నిర్వహించినా ఫలితాలు వేర్వేరుగా విడుదలవుతాయి. రెండు నోటిఫికేషన్ల ద్వారా నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీలో 831 పోస్టుల్ని భర్తీ చేస్తోంది యూపీఎస్‌సీ. ప్రస్తుతం రెండో నోటిఫికేషన్‌లోని 413 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 6 చివరి తేదీ. ఇంటర్ లేదా 10+2 పాసైనవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://upsconline.nic.in/ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి.

మొత్తం ఖాళీలు- 413

నేషనల్ డిఫెన్స్ అకాడమీ- 370 

(ఆర్మీ-208, 

నేవీ-42, 
ఎయిర్‌ఫోర్స్-120)

నావల్ అకాడమీ- 43

దరఖాస్తు ప్రారంభం- 16.06.2020

దరఖాస్తుకు చివరి తేదీ-  06.07.2020

అడ్మిట్ కార్డుల రిలీజ్- ఆగస్ట్ 2020 

పరీక్ష నిర్వహించే తేదీ-  06.09.2020

విద్యార్హత- 10+2 ప్యాటర్న్‌లో 12వ తరగతి పాస్ కావాలి. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలకు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ తప్పనిసరి.

UPSC NDA & NA EXAM (II) 2020: అప్లై చేయండి ఇలా
ముందుగా 
https://www.upsc.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో National Defence Academy and Naval Academy Examination (II), 2020 లింక్ పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్, దరఖాస్తు లింక్ ఉంటుంది.
నోటిఫికేషన్ క్లిక్ చేసి నియమనిబంధనలు పూర్తిగా చదవండి.
ఇన్‌స్ట్రక్షన్స్ చదివిన తర్వాత దరఖాస్తు లింక్ పైన క్లిక్ చేయండి.
మొదట Part-I రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
మీ వివరాలతో పార్ట్ 1 రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ చేయాలి.
ఫీజు చెల్లించి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్‌తో ఇంటర్మీడియట్ లేదా 10+2 పాసైనవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.

See the Notification here

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "UPSC Jobs: 413 jobs in defense, Navy"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0