Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

25 not 26 .. YCP clarity on formation of new districts in AP .. ’

25 కాదు 26 .. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై వైసీపీ క్లారిటీ ..
25 not 26 .. YCP clarity on formation of new districts in AP .. ’

అధ్యయన కమిటీ రిపోర్ట్ ఎలా ఉండబోతుందన్న దానిపై అంతటా ఆసక్తి నెలకొంది . కమిటీ రిపోర్ట్ ఎలా ఉన్నా .. వచ్చే ఏడాది మార్చి 31 కల్లా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది .

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఇటీవల సమావేశమైన ఏపీ కేబినెట్ జిల్లా ఏర్పాటుకు సంబంధించి సీఎస్ నేతృత్వంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్‌ విభాగం సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, కన్వీనర్‌గా ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీలైనంత త్వరలో నివేదిక ఇవ్వాలని కమిటీని సీఎం జగన్ ఆదేశించారు. ఐతే ఏపీలో ఎన్ని జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయన్న దానిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.
ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలోనే హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేసేందుకు ఇప్పుడు కసరత్తులు చేస్తున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిని ఒక జిల్లాగా చేస్తే ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు కావాలి. అంటే ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 12 జిల్లాలు వస్తాయి. ఐతే 26వ జిల్లా ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. కొత్తగా ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని.. 4 జిల్లాలకు అరకు ప్రాంతం విస్తరించి ఉందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి.. సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

ఐతే ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు చేస్తారా? లేదంటే అరకును రెండు జిల్లాలు చేసి.. మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేస్తారా? అని చర్చ జరుగుతున్న వేళ వైసీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 'త్వరలో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్' అని అధికారిక ఖాతాలో ట్వీట్ చేశారు. అరకు లోక్‌సభ పరిధిని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసే అవకాశముందని పేర్కొన్నారు

అధికార పార్టీ వైసీపీ ఖాతా నుంచే ఈ ట్వీట్ రావడంతో.. ఏపీలో 25 కాదు 26 జిల్లాలు కన్‌ఫామ్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఐతే కొత్త జిల్లాల ప్రతిపాదనపై ప్రజల నుంచి ఎన్నో డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అధ్యయన కమిటీ రిపోర్ట్ ఎలా ఉండబోతుందన్న దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. కమిటీ రిపోర్ట్ ఎలా ఉన్నా.. వచ్చే ఏడాది మార్చి 31 కల్లా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "25 not 26 .. YCP clarity on formation of new districts in AP .. ’"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0