Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

97 red zone zones in AP ... Which villages fall under that category?

ఏపీలో 97 రెడ్ జోన్ మండలాలు ... ఏయే ఊర్లు ఆ పరిధిలోకి వస్తాయో వివరణ ?
97 red zone zones in AP ... Which villages fall under that category?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ... రెడ్ జోన్ పరిధిలోకి వచ్చే మండలాలు , ఊళ్లను లెక్కలేసింది . వాటి ప్రకారం ... 97 మండలాలు రెడ్ జోన్లోకి వచ్చాయి .

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ బాగా పెరుగుతోంది. శుక్రవారం 1813 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. 17 మంది మరణించారు. కర్నూలు జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపూర్ లో ఒక్కరు, కడపలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో 12,533 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 14,393 మందిని డిశ్చార్జ్ చేశారు. 309 మంది ఇప్పటి వరకు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రెడ్ జోన్ మండలాల్ని లెక్కలేసింది. మొత్తం 97 మండలాల్ని రెడ్ జోన్‌ కింద చెప్పింది.

1.విశాఖపట్నం (3): విశాఖ (పట్టణ), పద్మనాభం, నర్సీపట్నం (పట్టణ).

2.తూర్పుగోదావరి (8): శంఖవరం గ్రామీణ, కొత్తపేట, కాకినాడ గ్రామీణ, పిఠాపురం (పట్టణ), రాజమండ్రి (పట్టణ), అడ్డతీగల, పెద్దాపురం (పట్టణ), రాజమహేంద్రవరం గ్రామీణ

3.పశ్చిమగోదావరి (9): ఏలూరు (పట్టణ), పెనుగొండ గ్రామీణ, భీమవరం (పట్టణ), తాడేపల్లిగూడెం (పట్టణ), ఆకివీడు, భీమడోలు, ఉండి, కొవ్వూరు (పట్టణ), నరసాపురం (పట్టణ)

4.కృష్ణా (5): విజయవాడ (పట్టణ), పెనమలూరు గ్రామీణ, జగ్గయ్యపేట (పట్టణ), నూజివీడు (పట్టణ), మచిలీపట్నం (పట్టణ)

5.గుంటూరు (12): గుంటూరు (పట్టణ), నరసరావుపేట, మాచర్ల (పట్టణ), అచ్చంపేట గ్రామీణ, మంగళగిరి (పట్టణ), పొన్నూరు (పట్టణ), చేబ్రోలు, దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి (పట్టణ)

6.కర్నూలు (17) : కర్నూలు (పట్టణ), నంద్యాల, బనగానపల్లి గ్రామీణ, పాణ్యం గ్రామీణ, ఆత్మకూరు (పట్టణ), నందికొట్కూరు (పట్టణ), కోడుమూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు (పట్టణ), ఓర్వకల్లు, అవుకు, పెద్దకడుబూరు, ఉయ్యాలవాడ, ఎమ్మిగనూరు (పట్టణ)

7.ప్రకాశం (9): ఒంగోలు (పట్టణ), చీరాల (పట్టణ), కారంచేడు, కందుకూరు (పట్టణ), గుడ్లూరు, కనిగిరి (పట్టణ), కొరిసపాడు, మార్కాపురం (పట్టణ), పొదిలి

8.నెల్లూరు (14): నెల్లూరు (పట్టణ), నాయుడుపేట (పట్టణ), వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లె, బోగోలు, బుచ్చిరెడ్డిపాళెం, గూడూరు (పట్టణ), కావలి (పట్టణ), కోవూరు, ఓజిలి, తోటపల్లిగూడూరు

9.చిత్తూరు (8): శ్రీకాళహస్తి (పట్టణ), తిరుపతి (పట్టణ), నగరి (పట్టణ), పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు

10.కడప (7): ప్రొద్దుటూరు (పట్టణ), కడప (పట్టణ), బద్వేలు (పట్టణ), పులివెందుల (పట్టణ), మైదుకూరు (పట్టణ), వేంపల్లె, ఎర్రగుంట్ల (పట్టణ)

11.అనంతపురం (5): హిందూపురం (పట్టణ), అనంతపురం (పట్టణ), కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు

ఈనెల 20 నుంచి కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల్ని జిల్లాల్లో అమలుచేయాలని ఏపీ ప్రభుత్వం కలెక్టర్లను కోరింది. రెడ్‌జోన్లలో 14 రోజులపాటు పాజిటివ్‌ కేసు నమోదు కాకుంటే ఆ మండలాన్ని ఆరెంజ్‌ జోన్‌ కిందకు మార్చుతుంది. ఆ తర్వాత మరో 14 రోజులపాటు పాజిటివ్‌ కేసు ఒక్కటీ రాకపోతే అప్పుడు గ్రీన్‌జోన్‌ పరిధిలోకి మండలం చేరుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "97 red zone zones in AP ... Which villages fall under that category?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0