Admissions in schools from tomorrow
రేపటి నుంచి బడుల్లో అడ్మిషన్లు
Download Academic Calendar Pdf
- తల్లిదండ్రులను మాత్రమే పాఠశాలలకు రప్పించాలి
- ప్రతి టీచర్ వారానికి ఒకసారి హాజరు కావాలి
- విద్యార్థి వారీ ప్రణాళికను రూపొందించుకోవాలి
- బయోమెట్రిక్ హాజరు నమోదు అవసరం లేదు
- ఆన్‌లైన్ బోధనకు ఓకే..
- ప్రత్యామ్నాయ ప్రణాళికకే పరిమితం కావాలి
- విద్యా క్యాలెండర్ విడుదల
- ‘బడి గంటలు’ మోగించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. 2020-21 విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను విడుదల చేసింది.
- దీని ప్రకారం... పాఠశాలల్లో సోమవారం నుంచి అడ్మిషన్లు మొదలవుతాయి. సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో... సెప్టెంబరు 4 వరకూ అడ్మిషన్లు చేసుకునేందుకు అనుమతించారు.
- అయితే విద్యార్థులను పాఠశాలలకు రాకుండా చూడాలి. వారి తల్లిదండ్రులను మాత్రమే రప్పించాలి. ప్రతి ఉపాధ్యాయుడు వారానికి ఒకసారి పాఠశాలకు రావాలి.
- వారు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాల్సిన అవసరం లేదు.
- శనివారం 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసిన పాఠశాల విద్యా కమిషనర్...
- దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.
- ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌లో ముఖ్యాంశాలు..
- ఉపాధ్యాయుడు తన తరగతి గదికి సంబంధించి విద్యార్థి వారీగా ప్రణాళికను రూపొందించుకోవాలి.
- పాఠ్యాంశాలకు ఆన్‌లైన్ బోధన చేపట్టవచ్చు. కానీ ఆ బోధన ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌లో సూచించిన పాఠ్యప్రణాళికకు మాత్రమే పరిమితమై ఉండాలి.
Download Academic Calendar Pdf
0 Response to "Admissions in schools from tomorrow"
Post a Comment