Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Appetite Fruits - Juices Details

ఆకలిని పెంచే పండ్లు - రసాలు వాని వివరాలు.
Appetite Fruits - Juices Details


చాలామందికి ఆకలి సరిగా వేయదు. జీర్ణక్రియ లోపం కారణంగా ఈ పరిస్థితి ఉంటుంది. విస్తర్లో పంచభక్ష్య పరమాన్నాలు ఉన్నప్పటికీ వాటిని ఆరగించేందుకు ఏ మాత్రం మనసురాదు. అలాంటి వారు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే కడుపున చాలామందికి ఆకలి సరిగా వేయదు. జీర్ణక్రియ లోపం కారణంగా ఈ పరిస్థితి ఉంటుంది. విస్తర్లో పంచభక్ష్యపరమాన్నాలు ఉన్నప్పటికీ వాటిని ఆరగించేందుకు ఏమాత్రం మనసురాదు. అలాంటి వారు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే కడుపునిండా లాగించవచ్చు. ఆ చిట్కాలేంటో పరిశీలిద్ధాం.

అల్లం : వికారం, అజీర్తికి అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ప్రతి రోజూ 4-5 అల్లం ముక్కలను దవడన పెట్టుకుని నమిలి, ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. దీనివల్ల క్రమంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఆకలి కూడా బేషుగ్గా అవుతుంది.

నిమ్మరసం : జీర్ణక్రియను వేగవంతం చేయడంలో నిమ్మరసం భలేగా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలిగించి ఆకలి పుట్టేలా చేస్తుంది. ఆకలి మందగించినపుడు గ్లాసు నీళ్లలో కాస్త నిమ్మరసం పిండి, అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకోండి. ఆకలి భేషుగ్గా ఉంటుంది.

ఖర్జూరాలు : పోషక విలువులు మెండుగా ఉన్నా ఖర్జూరాలకు ఆకలి పుట్టించే గుణం కూడా ఎక్కువే. దీన్ని రసంలా చేసి కూడా తీసుకోవచ్చు. ప్రతి రోజూ నాలుగైదు ఖర్జూరాలు తింటే ఆకలిలేమి తీరిపోతుంది.

మెంతులు : పొట్టలో గ్యాస్‌ను బయటకు తోసేయడంలో మెంతులు బాగా పని చేస్తాయి. దీంతో ఆకలి పెరుగుతుంది. ప్రతి రోజూ మెంతిపొడిని తేనెతో కలిపి తగిన మోతాదులో తీసుకుంటే ఆకలి పుడుతుంది.

ద్రాక్ష : ద్రాక్షలో విటమిన్‌-సి ఉంటుంది. అది జీర్ణక్రియను సాఫీగా సాగేలా చేస్తుంది. భోజనం చేశాక కొన్ని ద్రాక్షపళ్లు తినండి. తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణమైపోతుంది. ఆకలి కూడా పెరుగుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Appetite Fruits - Juices Details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0