Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Bank Jobs 9640

Bank Jobs: బ్యాంక్ జాబ్ మీ కలా? 9640 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఐబీపీఎస్
Bank Jobs 9640

IBPS RRB Recruitment 2020 కరోనా వైరస్ లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 9640 ఖాళీలను భర్తీ చేసేందుకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

1. బ్యాంకు ఉద్యోగం మీ కలా? బ్యాంకు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త. బ్యాంకు ఉద్యోగాల జాతర మొదలైంది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసంది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS. 

2. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 9640 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ స్కేల్ -I, II, III, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల్ని భర్తీ చేయనుంది. 

3. మొత్తం 9640 ఖాళీలు ఉండగా అందులో ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్)- 4624, ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్)- 3800, ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్-మేనేజర్)- 838, ఆఫీసర్ స్కేల్-II (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్)- 59, ఆఫీసర్ స్కేల్-II (చార్టర్డ్ అకౌంటెంట్)- 26, ఆఫీసర్ స్కేల్-II (లా ఆఫీసర్)- 26, ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ మేనేజర్)- 03, ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్)- 08, ఆఫీసర్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్)- 100, ఆఫీసర్ స్కేల్-III- 156 పోస్టులున్నాయి. 

4. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. డిగ్రీ, ఎంబీఏ లాంటి కోర్సులు చేసినవారు దరఖాస్తు చేయొచ్చు. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టుకు 18 నుంచి 28 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ III పోస్టుకు 21 నుంచి 40 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ II పోస్టుకు 21 నుంచి 32 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ I పోస్టుకు 18 నుంచి 30 ఏళ్లు. 

5. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూల్ 1న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 21 చివరి తేదీ. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి 2020 జూలై 21 చివరి తేదీ. అప్లికేషన్ సరిదిద్దుకోవడానికి 2020 జూలై 21 చివరి తేదీ. అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి 2020 ఆగస్ట్ 5 చివరి తేదీ. కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేయడానికి 2020 ఆగస్ట్ 12 చివరి తేదీ. దరఖాస్తు ఫీజు రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.180. 

6. ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ 2020 ఆగస్ట్ 24 నుంచి 29 మధ్య ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష 2020 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఉండొచ్చు. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు 2020 అక్టోబర్‌లో విడుదలవుతాయి. మెయిన్ / సింగిల్ ఎగ్జామ్ 2020 అక్టోబర్ లేదా నవంబర్‌లో ఉంటుంది. ఫలితాల 2020 నవంబర్‌లో విడుదల కావొచ్చు. ఇంటర్వ్యూ 2020 నవంబర్‌లో ఉంటుంది. 

7. ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ I పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఆఫీసర్ స్కేల్ II, III పోస్టులకు సింగిల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. 

8. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ముందు యాక్టీవ్‌లో ఉన్న ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకు వివరాలు సిద్ధంగా ఉండాలి. దరఖాస్తు సమయంలో పేరు, పుట్టిన తేదీ, కేటగిరీ, అడ్రస్, క్వాలిఫికేషన్ వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేయాలి. 

9. ఆ తర్వాత https://www.ibps.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో Apply online for CRP RRBs IX లింక్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో వేర్వేరు లింక్స్ ఉంటాయి. మీరు అప్లై చేయాలనుకున్న పోస్టుకు సంబంధించిన లింక్ క్లిక్ చేయాలి. మళ్లీ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది
10. ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ వివరాలు ఎంటర్ చేసి, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి 'Final Submit' పైన క్లిక్ చేయాలి. చివరగా పేమెంట్ చేసి దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Bank Jobs 9640"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0