Broadband Plans: Need an Internet connection? These are the best plans.
Broadband Plans : ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలా ? బెస్ట్ ప్లాన్స్ ఇవే.
Best Broadband Plans వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి జియోఫైబర్ , ఎయిర్టెల్ , బీఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలు బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ అందిస్తున్నాయి . వాటిలో రూ .1,000 లోపు బెస్ట్ ప్లాన్స్ ఏవో తెలుసుకుందాం.
Best Broadband Plans వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి జియోఫైబర్ , ఎయిర్టెల్ , బీఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలు బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ అందిస్తున్నాయి . వాటిలో రూ .1,000 లోపు బెస్ట్ ప్లాన్స్ ఏవో తెలుసుకుందాం.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? పిల్లలు ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నారా? ఇప్పుడు ఉన్న ఇంటర్నెట్ సరిపోవట్లేదా? కొత్తగా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్, టాటాస్కై తక్కువ ధరలో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. నెలకు రూ.1,000 లోపు బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి.
JioFiber Rs 699 Bronze plan: జియోఫైబర్ రూ.699 ప్లాన్ తీసుకున్నవారికి 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 100జీబీ+100జీబీ అదనపు డేటా+వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ కింద మరో 100 జీబీ కలిపి మొత్తం 300 జీబీ డేటా లభిస్తుంది. యూజర్లకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ యాక్సెస్ చేయొచ్చు.
JioFiber Rs 849 Bronze plan: జియోఫైబర్ రూ.849 ప్లాన్ తీసుకున్నవారికి 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 200జీబీ+100జీబీ అదనపు డేటా+వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ కింద మరో 200 జీబీ కలిపి మొత్తం 500 జీబీ డేటా లభిస్తుంది. యూజర్లకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ యాక్సెస్ చేయొచ్చు.
Airtel Rs 799 Plan: ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ బేసిక్ ప్లాన్ రూ.799 తీసుకున్నవారికి 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 150జీబీ డేటా లభిస్తుంది. డేటా తక్కువగా ఉపయోగించినట్టైతే మిగిలిన డేటాను తర్వాతి నెలకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. యూజర్లకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ యాక్సెస్ చేయొచ్చు.
Airtel Rs 999 Plan: ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ బేసిక్ ప్లాన్ రూ.999 తీసుకున్నవారికి 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 300జీబీ డేటా లభిస్తుంది. యూజర్లకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి. డేటా తక్కువగా ఉపయోగించినట్టైతే మిగిలిన డేటాను తర్వాతి నెలకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ యాక్సెస్ చేయొచ్చు.
BSNL Rs 499 Plan: బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ రూ.499 ప్లాన్ తీసుకున్నవారికి 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 100జీబీ డేటా లభిస్తుంది. 100జీబీ లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 2ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. యూజర్లకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి.
BSNL Rs 749 Plan: బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ రూ.749 ప్లాన్ తీసుకున్నవారికి 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 300జీబీ డేటా లభిస్తుంది. 300జీబీ లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 2ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఏ నెట్వర్క్ అయినా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
BSNL Rs 849 Plan: బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ రూ.849 ప్లాన్ తీసుకున్నవారికి 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 600జీబీ డేటా లభిస్తుంది. 600జీబీ లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఏ నెట్వర్క్ అయినా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
Tata Sky Rs 790 Plan: టాటా స్కై రూ.790 ప్లాన్ తీసుకున్న వారికి 50ఎంబీపీఎస్ స్పీడ్‌తో 150 జీబీ డేటా లభిస్తుంది. డేటా తక్కువగా ఉపయోగించినట్టైతే మిగిలిన డేటాను తర్వాతి నెలకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది.
Tata Sky Rs 950 Plan: టాటా స్కై రూ.950 ప్లాన్ తీసుకున్న వారికి 1500 జీబీ డేటా లభిస్తుంది.
ACT Fibernet Rs 799 Plan: యాక్ట్ ఫైబర్‌నెట్ రూ.799 ప్లాన్ తీసుకున్నవారికి 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో 500జీబీ డేటా లభిస్తుంది. యూజర్లకు అదనంగా 1000జీబీ డేటా అందిస్తోంది యాక్ట్ ఫైబర్‌నెట్.
0 Response to "Broadband Plans: Need an Internet connection? These are the best plans."
Post a Comment