Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Economic tsunami in the next five years

వచ్చే ఐదేళ్లలో ఆర్ధిక సునామీ
ఏపీ ఆర్థిక వ్యవస్థపై యండమూరి వీరేంద్రనాథ్ అద్భుత విశ్లేషణ, హెచ్చరికలు
Economic tsunami in the next five years

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ గ్రహీత యండమూరి వీరేంద్రనాథ్ కీలక విశ్లేషణ చేశారు. ప్రభుత్వాలు పేదలకు ఉచితం, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలపై మోయలేని భారాలను వేస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రాబోయే ప్రమాదం తెలుసుకోకుండా...
‘మన రాష్ట్ర వ్యవస్థ ఇలా తయారవటానికి అంకురార్పణ 20 ఏళ్ల క్రితం ప్రారంభం అయింది. రాబోయే ప్రమాదాన్ని తెలుసుకోకుండా కాంగ్రెస్ గానీ, టీడీపీ గానీ, ప్రస్తుత ప్రభుత్వం గానీ పోటీ పడి ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇతర రాష్ట్రాలకు పాకింది' అని యండమూరి వ్యాఖ్యానించారు.
ప్రజలు పూర్తిగా పని మానేసి...
‘సంపన్నుల నుంచి పన్నులు వసూలు చేసి, బీదలను పైకి తీసుకురావటం సోషలిజం. కానీ సంపన్నులు ‘డబ్బు పెంచుకోవటానికి ‘ఉత్పత్తి' అవసరం లేదన్న' విషయం తెలుసుకున్నారు. ఉత్పాదన తగ్గించి, ‘సంపద సృష్టించటం' మానేశారు. నేను ఇప్పటికే ఈ రియల్ ఎస్టేట్, మనీ లాండరింగ్ కాన్సెప్ట్‌లపై వరించాను. దీంతో పన్నుల రాబడి తగ్గిపోతోంది. మరోవైపు, బీదలు పైకి రావటానికి బదులు ఉచిత చదువు, వైద్యం, బియ్యం, కరెంటు. అంతా ఉ..చి..తంగా పొందటానికి అలవాటు పడుతున్నారు. ఇంకో దశాబ్దం అయ్యేసరికి 95 శాతం ప్రజలు పని పూర్తిగా మానేసి, ప్రభుత్వంపై ఆధారపడతారు. వారినీ తప్పు పట్టలేం. ఉత్పాదన లేనప్పుడు, ఇసుక దొరకనప్పుడు, కొత్త పరిశ్రమలు రానప్పుడు పన్నులు ఎక్కడ ఉంటాయి?' అని యండమూరి ప్రశ్నించారు.
ఇలా మనుగడ కష్టసాధ్యమే...
‘సరే. సోషలిజం సంగతి పక్కన పెడదాం. మీకు తెలుసా? మన రాష్ట్రం ఎఫ్ఆర్‌బీఎం(ద్రవ్య బాధ్యత, బడ్జెట్ మేనేజ్‌మెంట్) క్రమశిక్షణ పరిమితి 3.5ను దాటింది. కానీ, ఇది మనుగడకు ఎంతమాత్రం సరిపోదు అని అన్నారు. ఆర్ధిక క్రమశిక్షణలో అధమ స్థానం ఇది. మన ఆదాయం 55 వేల కోట్లు అయితే ఉచిత వరాలు 50 వేల కోట్లు. వడ్డీ కట్టటానికి అప్పు చేస్తున్న స్థితి. మరో వైపు ప్రభుత్వం కాంట్రాక్టర్లకీ, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకీ, ఇంజనీరింగ్ కాలేజీలు మొదలైనవాటికీ ఏడాది కాలంగా దాదాపు 25 వేల కోట్లు బాకీపడి ఇవ్వటం లేదు. ఇదిలా ఉండగా పెన్షన్లు 1,000 శాతo పెరిగాయి' అని యండమూరి వివరించారు.
ఆర్థిక సునామీ తప్పదు...
‘రూ. 50వేల కోట్లు అప్పులు, రూ. 50వేల కోట్ల వేజ్ బిల్లు, వడ్డీ రూ. 25వేల కోట్ల చెల్లింపుల హామీతో ప్రభుత్వం రూ. 2.2కోట్ల బడ్జెట్ అంచనా వేసింది. ఇక కొత్త పరిశ్రమలకి పెట్టుబడి ఎక్కడుంది? దాంతో వచ్చే పదేళ్ళలో నిరుద్యోగం మరింత పెరిగిపోతుంది. అప్పటికే దివాళా తీసి ఉన్న రాష్ట్రానికి కేంద్రం సాయం చెయ్యదు. అధికారం నిలుపుకోవటానికి పార్టీలు వేసే మెతుకలకి బలి అయ్యేది మనమే. ప్రస్తుతం ప్రమాదం చాప క్రింద నీరులా నెమ్మదిగా వస్తోంది. మరో అయిదేళ్ళకి ఇది సునామీ అవుతుంది. మళ్ళీ చెపుతున్నాను. ఇది రాజకీయ ఉపన్యాసం కాదు. కేవలం ఆర్థిక రంగానికి సంబంధించింది' అని యండమూరి వీరేంద్రనాథ్ సున్నితంగా హెచ్చరించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Economic tsunami in the next five years"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0