Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Heard immunity if the Schools are open

బడులు తెరిస్తే హెర్డ్ ఇమ్యూనిటీ 
ఎయిమ్స్ ప్రొఫెసర్లు , వైద్యనిపుణుల అభిప్రాయం
Heard immunity if the Schools are open

న్యూఢిల్లీ , జూలై 20 : పాఠశాలలు , కళాశాలలు తెర వడం ద్వారా కరోనాకు సమూహ రోగనిరోధక శక్తి ( హెర్డ్ ఇమ్యూనిటీ ) సాధించ్చవచ్చని ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( ఎయిమ్స్ ) ప్రొఫెసర్లు కొందరు అభిప్రాయపడ్డారు . కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నందున .. ఇప్పటికిప్పుడే కాకుండా , కేసుల పెరుగుదల వేగం నిలకడగా ఉన్న దశలో స్కూళ్లు , కాలేజీలు తెరవాలని , అప్పుడు హెర్డ్ ఇమ్యూ నిటీ సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటా యని వారు చెబుతున్నారు . ఏదైనా వైరస్ విజృంభిస్తు న్నప్పుడు దాని బారి నుంచి కాపాడేవి రెండే . ఒకటి - ఆ వైరసను కట్టడి చేసే వ్యాక్సిన్ . రెండోది హెర్డ్ ఇమ్యూ నిటీ . సమూహ రోగనిరోధక శక్తిని రెండు రకాలుగా సాధించవచ్చు . ఒకటి .. జనాభాలో 70 % మంది ఆ వైర సకు ఎక్స్పోజ్ కావడం ద్వారా , రెండు వ్యాక్సిన్ ద్వారా , కరోనాను నిరోధించే వ్యాక్సిన్ కోసం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాల శాస్త్రజ్ఞులు , వైద్యనిపుణులు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు . కొంతమేరకు పరోగతి సాధించారు కూడా . కానీ , సమర్ధమైన వ్యాక్సిన్ నిజంగా ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు . కాబట్టి ఎక్కువ మంది వైరకు ఇన్ ఫెక్ట్ అవడం ద్వారా హెర్డ్ ఇమ్యూ నిటీని సాధించడమే మనముందున్న మార్గమని ఎయి మ్స్ లోని సెంటర్ ఫర్ కమ్యూనిటీ ప్రొఫెసర్ సంజయ్ కె.రాయ్ పేర్కొన్నారు . వైరస్ భయంతో మూసేసిన స్కూళ్లు , కాలేజీలను కనుక . శానిటైజేషన్ , భౌతిక దూరం వంటి నిబంధనలన్నీ పాటిస్తూనే మళ్లీ తెరిస్తే ఆందరూ వైరకు ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఎక్కు వగా ఉంటుందని ఆయన వివరించారు . పిల్లల రోగనిరోధక శక్తి తాజాగా ఉంటుంది కనుక వారు దాన్ని సమ ర్థంగా ఎదుర్కొని , హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడంలో కీలకంగా పనిచేస్తారని డాక్టర్ రాయ్ అభిప్రాయపడ్డారు . ఈ ప్రక్రియ కొద్దిగా కష్టమైనప్పటికీ .. జాగ్రత్తగా అమలు చేస్తూ , పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకుంటే ఇది విజయ వంతమవుతుందని పేర్కొన్నారు . ఇక .. కొవిడ్ -19 సంక్షోభాన్ని లాక్డౌన్ ఆంక్షలు పరిష్కరించలేవని సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం మాజీ అధిపతి డాక్టర్ చంద్రకాంత్ ఎస్ పాండవ్ అన్నారు . సమూహ రోగనిరోధక శక్తిని సాధించడమే ఈ సమస్యకున్న ఏకైక పరిష్కారమని ఆయన తేల్చిచెప్పారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Heard immunity if the Schools are open"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0