Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to edit a PDF document file.

PDF డాక్యుమెంట్ ఫైల్ ను సవరించడం ఎలా.
How to edit a PDF document file.

ఏదైనా విలువైన సమాచారాన్ని PDF డాక్యుమెంట్ రూపంలో పంచుకోవడం ప్రస్తుతం చాలా ప్రాచుర్యం పొందింది. కాని పిడిఎఫ్ ఫైళ్ళను ఒక సారి క్రియేట్ చేసిన తరువాత దానిని ఉచితంగా సవరించడం అంత సులభం కాదు. PDF ల విషయంలో ఉత్తమమైన విషయం ఏమిటంటే మీరు PDF డాక్యుమెంటును చూడటానికి ఉపయోగించే అన్ని డివైస్ లలో కంటెంట్ మెరుగ్గా కనిపిస్తుంది.

PDF Editing

PDF డాక్యుమెంటులోని ఏదైనా సమాచారాన్ని సవరించడానికి ఉపయోగించే అడోబ్ అక్రోబాట్ అధిక మొత్తంలో చందాను వాసులు చేస్తుంది

PDF డాక్యుమెంటులోని ఏదైనా సమాచారాన్ని సవరించడానికి ఉపయోగించే అడోబ్ అక్రోబాట్ అధిక మొత్తంలో చందాను వాసులు చేస్తుంది

ఈ రుసుము మొత్తాన్ని చెల్లించటానికి చాలామంది ఇష్టపడరు. వాస్తవానికి PDF లను ఉచితంగా సవరించడానికి అనుమతించే మరి కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. PDF ఫైల్‌ను ఎలా సవరించాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

PDF ఫైళ్ళను ఆన్‌లైన్ లో సవరించడం ఎలా?

PDF డాక్యుమెంటులను ఎటువంటి మూడవ యాప్ ను డౌన్‌లోడ్ చేయవలసిన అవసరం లేకుండా అన్ని ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లలో సవరించవచ్చు. అనగా విండోస్ 10, మాకోస్, ఆండ్రాయిడ్ మరియు iOS లలో కూడా వీటిని సవరించవచ్చు. కింద ఉన్న ఈ దశలను అనుసరించడం ద్వారా సులభంగా వీటిని ఎడిట్ చేయవచ్చు.

  • 1. మొదటగా Www.pdfescape.com వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
  • 2. మీరు ఎడిట్ చేయవలసిన PDF ఫైల్‌ను ఎంచుకొండి.
  • 3. తరువాత మీరు ఎంచుకున్న ఫైల్‌ను సవరించడానికి ఇందులో అప్‌లోడ్ చేయండి.
  • 4. కొన్ని సెకన్లు ప్రాసెసింగ్ జరిగిన తరువాత ఫైల్ సవరించడానికి మీకు అందుబాటులో ఉంటుంది. దీని యొక్క ఎడమ పేన్‌లో టెక్స్ట్, బ్లాంక్ బాక్స్ లను జోడించడానికి అనుమతించే టూల్స్ లను చూడవచ్చు. 
  • ఇందులో PDF ఫారమ్‌లను జోడించడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. 
  • అంతేకాకుండా స్టిక్కీ నోట్లను కూడా జోడించడానికి అనుమతించే మార్గాలు కూడా ఉన్నాయి.
  • 5. PDF ఫైల్‌ను సవరించడం పూర్తయిన తర్వాత ఇందులో గల సేవ్ మరియు డౌన్‌లోడ్ PDF బటన్‌ను నొక్కడం ద్వారా మీ పరికరంలో PDF డాక్యుమెంటును సేవ్ చేయవచ్చు.


ఆఫ్‌లైన్‌లో PDF ఫైళ్ళను సవరించే మార్గాలు
How to edit a PDF document file.

వినియోగదారులు వారి యొక్క కంప్యూటర్లలో ఆఫ్‌లైన్‌లోనే PDF ఫైల్‌ను సవరించవచ్చు. లిబ్రేఆఫీస్ అనే యాప్ సహాయంతో మీ కంప్యూటర్‌లో ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేకుండా PDF ఫైల్‌లను ఉచితంగా సవరించవచ్చు.

1. మొదట Www.libreoffice.org/download/download> కి వెళ్లి మీ OS ని ఎంచుకుని డౌన్‌లోడ్ చేసుకోండి.
2. ఈ ఫైల్ డౌన్‌లోడ్ అయిన తర్వాత దాన్ని మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని దానిని ఓపెన్ చేయండి.
PDF ఆఫ్‌లైన్‌ ఎడిటింగ్
3. యాప్ ను ఓపెన్ చేసిన తర్వాత ఇందులో గల ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు సవరించదలిచిన PDF ఫైల్‌ను ఎంచుకోండి.
4. తరువాత పేజీలోని అంశాలను క్షుణంగా పరిశీలించి మీరు సవరించవలసిన అంశాలను అందులో జోడించి సేవ్ బట్టెన్ మీద నొక్కండి.
5. ఎడిట్ చేయడం పూర్తయిన తర్వాత ఫైల్ క్లిక్ చేసి అందులో "ఎక్సపోర్ట్ PDF" ఎంపికను ఎంచుకోండి. ఈ పద్ధతి స్కాన్ చేసిన PDF ఫైళ్ళతో కూడా పనిచేస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to edit a PDF document file."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0