Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IBPS RRB 2020: Total 9640 bank jobs ... This is the syllabus.

IBPS RRB 2020 : మొత్తం 9640 బ్యాంకు ఉద్యోగాలు ... సిలబస్ ఇదే
IBPS RRB 2020: Total 9640 bank jobs ... This is the syllabus.

IBPS RRB Recruitment 2020 బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి పండగే . ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్- IBPS 9640 పోస్టుల్ని భర్తీ చేస్తోంది . ఎగ్జామ్ ప్యాటర్న్ , సిలబస్ తెలుసుకుందాం.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 9640 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆఫీసర్ స్కేల్ -I, II, III, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల్ని భర్తీ చేయనుంది ఐబీపీఎస్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. . ఇక డిగ్రీ, ఎంబీఏ లాంటి కోర్సులు చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఎంపిక విధానం, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ లాంటి వివరాలు తెలుసుకోండి.
IBPS RRB ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు
IBPS RRB ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలతో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 2, 3 పోస్టులకు మెయిన్స్ సింగిల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో 80 ప్రశ్నలకు 80 మార్కులు ఉంటాయి. రీజనింగ్‌కు 40 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీకి 40 మార్కులుంటాయి. ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్స్ ఎగ్జామ్‌లో 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. రీజనింగ్ 40 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ పేపర్ 40 ప్రశ్నలకు 20 మార్కులుంటాయి.
IBPS RRB ఆఫీసర్ స్కేల్ , II, పోస్టులకు
IBPS RRBఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ పోస్టుకు మెయిన్స్ ఎగ్జామ్‌లో 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. రీజనింగ్ 40 ప్రశ్నలకు 50 మార్కులు, క్వాంటిటీవ్ యాప్టిట్యూట్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ 40 ప్రశ్నలకు 50 మార్కులు, ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ పేపర్ 40 ప్రశ్నలకు 20 మార్కులుంటాయి. ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ కేడర్ పోస్టుకు మెయిన్స్ ఎగ్జామ్‌లో 240 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. రీజనింగ్ 40 ప్రశ్నలకు 50 మార్కులు, క్వాంటిటీవ్ యాప్టిట్యూట్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ 40 ప్రశ్నలకు 50 మార్కులు, ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ 40 ప్రశ్నలకు 20 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ పేపర్ 40 ప్రశ్నలకు 20 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ పేపర్ 40 ప్రశ్నలకు 40 మార్కులుంటాయి
IBPS RRB ఆఫీసర్ స్కేల్ , III, పోస్టులకు
IBPS RRB ఆఫీసర్ స్కేల్ 3 మెయిన్స్ ఎగ్జామ్‌లో 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. రీజనింగ్ 40 ప్రశ్నలకు 50 మార్కులు, క్వాంటిటీవ్ యాప్టిట్యూట్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ 40 ప్రశ్నలకు 50 మార్కులు, ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, హిందీ లాంగ్వేజ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ పేపర్ 40 ప్రశ్నలకు 20 మార్కులుంటాయి.

అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లోనే ఆబ్జెక్టీవ్ పద్ధతిలో ఉంటాయి. ప్రతీ తప్పు సమాధానానికి 1/4 నెగిటీవ్ మార్కులు ఉంటాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ముందుగా ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ఓపెన్ చేసి నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ లాంటి వివరాలు చెక్ చేసుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IBPS RRB 2020: Total 9640 bank jobs ... This is the syllabus."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0