Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

quake Track: Earthquake prediction technology ... manufactured by GOOGLE.

Quake Track : భూకంపాల్ని ముందే గుర్తించే టెక్నాలజీ ... తయారుచేస్తున్న GOOGLE.

Earthquake Track : నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు . GOOGLE మాత్రం ... రాబోయే భూకంపాల్ని ముందే చెప్పేస్తామంటోంది . ఎలాగో తెలుసుకుందాం . 

Earthquake Track : ఓ అగ్నిపర్వతం బద్ధలయ్యేలా ఉంటే... దాన్ని అధికారులు ముందుగానే గుర్తించగలుగుతున్నారు. స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించగలుగుతున్నారు. ఇలా చాలా సందర్భాల్లో జరుగుతోంది. కానీ... భూకంపాల్ని ముందుగా గుర్తించడం మాత్రం ఇప్పటివరకూ సాధ్యం కావట్లేదు. చివరకు ఆకాశంలో పిడుగులు ఎక్కడ పడతాయో కూడా చెప్పగలుగుతున్నా... క్షణాల్లో వచ్చి... సర్వనాశం చేసే భూకంపాల్ని కనిపెట్టడం కష్టమవుతోంది. GOOGLE సీఈఓ సుందర్ పిచాయ్ మాత్రం... భూకంపాల్ని ముందుగానే కనిపెట్టే టెక్నాలజీని డెవలప్ చేస్తున్నామని తెలిపారు. ఈ టెక్నాలజీతో భూకంపాలు, సునామీలను ముందుగా ఎలా తెలుసుకోవచ్చో... ప్రయోగాలు చేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వివరించారు.
ఈ లక్ష్యం సాధించ‌డానికి GOOGLE... 
సముద్రాల్లో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ని ఉపయోగించనుంది. ఈ కేబుల్స్ ముందుగానే భూకంపాల్ని గుర్తించి... వార్నింగ్ ఇవ్వగలవని ఆయన అంటున్నారు. వంద కిలోమీటర్ల వరకూ ఉన్న దూరంలో భూ కదలికల్ని ఇవి గుర్తించగలవని చెబుతున్నారు. ఈ ఫైబర్ కేబుల్స్... ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లోనూ ఉన్నాయి. అందువల్ల తాము ప్రత్యేకించి చేయాల్సినది ఏమీ లేదనీ... ఉన్న కేబుల్స్‌తోనే ఇది సాధిస్తామని సుందర్ పిచాయ్ తెలిపారు.

ఈ ఆప్టిక్ ఫైబర్స్... ప్రపంచంలోని అన్ని ఖండాలకూ లింకై ఉన్నాయి. ఇంటర్నెట్ కూడా వీటి ద్వారానే... ప్రపంచంలోని అన్ని దేశాలకూ చేరుతోంది. సముద్రంలోపలి ఉపరితలంపై ఈ కేబుల్స్ వేశారు. గూగుల్‌కి చెందిన గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ అండర్‌సీ కేబుల్స్... భూకంపాలపై పరిశోధన చేసి... సమాచారం సేకరించి... కాంతి వేగంతో ప్రజలకు చేరవేస్తుందని సుందర్ పిచాయ్ వివరించారు. ఎందుకంటే ఈ కేబుల్స్ ద్వారా డేటా... సెకండ్‌కి 204190 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. అందువల్ల ప్రపంచంలో ఎక్కడి వారికైనా భూకంపం వస్తోందని క్షణాల్లో చెప్పేయవచ్చు.

GOOGLE ఈ ప్రాజెక్టును 2013లో ప్రారంభించి... 2019లో తొలిసారిగా ప్రయోగం చేసి చూసింది. అప్పటి నుంచి మెక్సికో, చిలీలో... చిన్న చిన్న భూకంపాల్ని ముందుగానే గుర్తించగలుగుతున్నారు. ఇది విజయవంతం అయితే... ఏటా లక్షల మంది ప్రాణాలను కాపాడేందుకు వీలవుతుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "quake Track: Earthquake prediction technology ... manufactured by GOOGLE."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0