Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Soon the process of teacher transfers

ఉపాధ్యాయుల బదిలీల ఎదురుచూపులకు మోక్షం.
మార్గదర్శకాలతో ముసాయిదా సిద్ధం
హేతుబద్ధీకరణకు మార్గం సుగమం
త్వరలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ
Soon the process of teacher transfers


ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, బదిలీలకు మూడేళ్ల తర్వాత ప్రస్తుతం ప్రభుత్వం పచ్చజెండా ఊపటంతో మార్గదర్శకాలకు సంబంథించిన ముసాయిదాను విద్యాశాఖ రూపొందించింది. ఉత్తర్వులు రెండు మూడు రోజుల్లో రానుండటంతో వాటిని అనుసరించి జిల్లాలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ నిర్వహించేందుకు విద్యాశాఖ సమాయత్తమైంది.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. అందులో భాగంగా అమ్మఒడి, ‘నాడు-నేడు’ జగనన్న విద్యాకానుక, నాణ్యమైన పౌష్టికాహారం వంటి పథకాలు అమల్లోకి తీసుకువచ్చింది. ఇవి సఫలీకృతం కావాలంటే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు చేపట్టాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆ దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం నాటికే పూర్తిస్థాయిలో ఈ ప్రక్రియ ముగిసేలా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 12,452 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. బదిలీలకు సంబంధించిన కసరత్తు ముగింపు దశకు చేరుకుంది. కీలకమైన హేతుబద్ధీకరణకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో ఉపాధ్యాయ సంఘాల చర్యలు కొలిక్కి రావడంతో 2, 3 రోజుల్లో ఉత్తర్వులు రానున్నాయి.
యూ డైస్‌ ఆధారంగా..
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రస్తుతం యూ-డైస్‌కు సంబంధించి విద్యార్థుల నమోదు ప్రకారం పోస్టులు హేతుబద్ధీకరణ చేపట్టనున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి పాఠశాలల నమోదు అందులో చూపించారు. జిల్లా వ్యాప్తంగా ఎస్జీటీలు 280 మందికిపైగా అధనంగా వచ్చే అవకాశం ఉండగా, ఆయా పోస్టులను 40 నుంచి 60 మంది విద్యార్థులున్న చోట సర్దుబాటు చేయనున్నారు.
ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇద్దరితో..
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ మేరకు రాష్ట్రంలో ఎక్కడా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా 40 మంది లోపు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 462 ఏకోపాధ్యాయ పాఠశాలల్లో రెండో పోస్టు మంజూరు కానుంది. డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న 84 పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించనున్నారు.
1:30 నిష్పత్తిలోనే..
గతంలో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1ః30గానే పరిగణించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అనుకొన్న లక్ష్యాలను సాధించాలన్నా ఆంగ్ల మాధ్యమం ప్రవేశం పెడుతున్నందున 1:20 నిష్పత్తిలో ఉపాధ్యాయులను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. 150 మంది విద్యార్థులుంటేనే ఎల్‌ఎఫ్‌ఎల్‌ పోస్టు అనే నిబంధన సడలించాలని, గతంలో ఉన్న ఎల్‌ఎఫ్‌ఎల్‌ పోస్టులను విద్యార్థుల నమోదుతో సంబంధం లేకుండా కొనసాగించాలని, ఆయా పోస్టును ఎస్జీటీగా లెక్కిస్తూ ఎల్‌ఎఫ్‌ఎల్‌ పోస్టులను తగ్గించవద్దని సంఘాలు కోరుతున్నాయి.
గత నిబంధనలు కొనసాగింపు..
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో గతంలోని నిబంధనలనే కొనసాగించనున్నారు. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వస్తే ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి పంపించనున్నారు. ఉన్నత పాఠశాలల్లో భౌతిక, జీవ శాస్త్రాలకు 280పైన విద్యార్థులున్న చోట రెండో పోస్టును మంజూరు చేయనున్నారు.
నిష్పత్తి తగ్గించాలి
ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని 1:20కు తగ్గించాలి. ఉన్నత పాఠశాలల్లో వేర్వేరు మాధ్యమాలకు వేర్వేరుగా పోస్టులు మంజూరు చేయాలి. ఆదర్శ పాఠశాలల్లో ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం కాకుండా 5 తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులను నియమిస్తే సత్ఫలితాలిస్తాయి. - 
ఇద్దరు ఉపాధ్యాయులనేది మంచి నిర్ణయం
ఉపాధ్యాయుల బదిలీలకు ముందే హేతుబద్ధీకరణ పూర్తి చేయాలి. ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా ప్రతి పాఠశాలకు ఇద్ద్దరు ఉపాధ్యాయులను నియమించటం శుభపరిణామం ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంను నియమిస్తే మరిన్ని సత్ఫలితాలొస్తాయి. -

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Soon the process of teacher transfers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0