Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Teacher transfers ambiguity.!

ఉపాధ్యాయ బదిలీలు సందిగ్ధత.!
Teacher transfers ambiguity.!

ఉపాధ్యాయ బదిలీలు జరపాలని ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు కోరగా ఈ నెలలో జరపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. కానీ కరోనా నేపథ్యంలో ఉపాధ్యాయ బదిలీలు ఎంతవరకు జరుగుతాయన్న సందిగ్ధత ఉపాధ్యాయుల్లో నెలకొని ఉంది. కొద్ది రోజుల క్రితం ఉపాధ్యాయ బదిలీల గూర్చి చర్చించడానికి రాష్ట్ర విద్యా కమీషనర్ ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో ముఖ్యమైన విషయాలు చర్చకు రాలేదని అధికశాతం ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు ఆన్లైన్ విధానంలో జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. మాన్యువల్ పద్ధతిలో జరపాలని ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. తప్పనిసరి బదిలీలు ఉన్న హెడ్ మాస్టర్, స్కూల్ అసిస్టెంట్లు, పండితులకు వెబ్ కౌన్సిలింగ్ కొంతవరకు అనువుగానే ఉంటుంది. రేషనలైజేషన్, ఎనిమిది అకడమిక్ సంవత్సరాలు పూర్తైన ఎస్జీటీ ఉపాధ్యాయులు ప్రతి జిల్లాలో సుమారు మూడు వేల మంది వరకూ ఉంటారు. వీరంతా తప్పనిసరి బదిలీ కావలసి వారు. ఒక ఎస్టీటీ ఒక మండలంలో ఒక పాఠశాలను కోరుకోవడానికి మూడువేల ఆషన్స్ ఇవ్వాలంటే ఎంత కష్టతరమో అధికార్లు ఆలోచించాల్సి ఉంది. అంతేకాకుండా ఈ విధానంలో పారదర్శకత ఉండదనే అభిప్రాయం కూడా ఉంది మైన ఖాళీలు కనపడకుండా చేసే అవకాశం ఉంటుంది. కౌన్సెలింగ్ అంటే కోరుకున్న పాఠశాలకు వెళ్లడం. 2017 లో జరిగిన అను భవాల దృష్ట్యా ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సి లింగ్ ద్వారా కోరుకున్న పాఠశాలకు అవకాశం రాక పోవచ్చు. అన్ని మండలాల్లో ఉన్న అన్ని పాఠశాలల వివరాలు ఉపాధ్యాయులు నాకు తెలియదు. ఒకసారి పొరపాటున తెలియని ష్లేసు ఆస్టెడ్ చేసుకోవడం జరిగితేకొన్ని సంవత్సరాల పాటు ఉపాధ్యాయులు బాధపడుతూ మానసిక ఆందోళన చెందుతారు. ఇటువంటి ముఖ్యమైన విషయం మీద ఉపాధ్యాయ సంఘాలు నామమాత్రంగా కూడ చర్చజరపలేదని ఉపాధ్యా యులు అభిప్రాయపడుతున్నారు. విద్యా ర్థుల భవిష్యత్తుకు పునాది ప్రాథమిక విద్య. దీనిని బలోపేతం చేయడానికి విధానపరమైన మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ప్రాథమిక విద్యలో ఇంకా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. తగినంత మంది ఉపాధ్యాయులను కేటాయించకుండానే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరుకోవడం ప్రభుత్వానికి అత్యాశే అవుతుంది. సిలబస్ తక్కువగా ఉన్న రోజులలో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1 30 గా ఉండేది. సిలబస్ పెరగడం, శాస్త్ర, సాంకేతిక ( విద్య అందించాల్సిన ఈ రోజుల్లో కూడా అదే నిష్పత్తి కొనసాగడం సరియైన విధానం కాదు. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1, 20 గా మార్పు చేయాలి. రేషనలైజేషన్ కు ముందు ఆ గ్రామంలో ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను కూడా పరిగణనలోకి తీసుకొని తప్పని పరిస్థితుల్లో మాత్రమే రేషనలైజేషన్ చేయాలి. ఒకసారి ఉపాధ్యాయ పోస్టుల పోతే పిల్లల సంఖ్య ఎంత పెరిగినా మరలా ఉపాధ్యాయ పోస్ట్ పోతేవచ్చే పరిస్థితి ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో లేదు. ఆంగ్ల మాధ్యమం, నాడు నేడు. జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన వంటి కార్యక్రమాలు, పాతిక దాకా యాప్ల ఆవరేటింగ్ కు ప్రతి పాఠశా లలో ఒక ఉపాధ్యాయుడు అధిక సమయం కేటాయించాల్సి వస్తున్నది. ఇద్దరు ఉపాధ్యాయులను పాఠశాల లలు ఏరోపాధ్యాయ పాఠశాల అవుతాయి. కాబట్టి ప్రతి ప్రాథమిక పాఠశాల ఒక పి.ఎస్.హెచ్.ఎం పోస్ట్ ఇవ్వాలి. కొన్ని జిల్లాల్లో ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉన్న పండిట్ పోస్టులన్నీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ అయి నాయి. పండిట్ భాళీలు లేవు. డి.ఇ ఓ పూల్ లో ఉన్న పండితులను ప్రాథమికోన్నత పాఠశాల లల్లో ఎలా సర్దుబాటు చేస్తారో వివరణ యివ్వలేదు. మాన్యువల్ కౌన్సెలింగ్, ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1 గాతీసుకోవడం, నంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాల సి ఎస్.హెచ్.ఎమ్ పోస్ట్ మం జూరు, 5 సంవత్సరాలు నిండిన పిల్లల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని రేషనలైజేషన్ జరపడం వంటి విష యాలమీద అధికారులు, ప్రభుత్వం పునరా ఆలోచించాలి ఉపాధ్యాయులు కోరుతున్నారు, ఎస్టీటీ జ ల బదిలీలు మాత్రం మాన్యువల్ పద్దతిలో జరగాలని, 20192020 సంవత్సరాలలో పదోన్నతుల ద్వారా భర్తీ అయిన ఖాళీలను కూడ ఈ బదిలీలలో భారీగా దూపాలని, బదిలీలలో సర్వీసు పాయింట్లు సంవత్సరానికి ఒక పాయింటు యివ్వాలని, స్టేషన్ సీనియారిటీకి పాయింట్లు మొదటి కేటగిరికి ఒకటి, రెండవ కేటగిరికి రెండు మూడవ కేటగిరికి మూడు, నాల్గవ కేటగిరికి నాలుగు ప్రకారం ఇవ్వాలని, 8 సంవత్సరాల సర్వీసుకు ప్రత్యేకంగా పాయింట్లు అవసరం లేదని, 2017 బదిలీలలో ఇచ్చిన ఇతర పాయింట్లు ఏవీ అవసరం లేదని, స్పెషల్ పాయింట్లు, ప్రిఫరెన్షియల్ నిబందనలు బదిలీల ప్రకారం ఇవ్వాలని ఇవ్వాలని కోరుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Teacher transfers ambiguity.!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0