Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The new rule of IT returns is to calculate huge transactions

ఐటీ రిటర్న్స్ కొత్త రూల్ , భారీ ట్రాన్సాక్షన్స్ లెక్కలు చెప్పాల్సిందే
The new rule of IT returns is to calculate huge transactions

పన్ను చెల్లింపుదారులు భారీ ఆర్థిక లావాదేవీల వివరాలను కొత్త ఫామ్ 26ASలో పొందుపరచాల్సి ఉంటుందని ఆదాయపు పన్ను విభాగం (IT డిపార్టుమెంట్) తెలిపింది. ఒక ఆర్థిక సంవత్సరంలో జరిగే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నింటిని అందులో ఇవ్వడం ద్వారా ఐటీ రిటర్న్స్ ఈజీగా ఈ-ఫైలింగ్ చేసేందుకు వీలు అవుతుందని తెలిపింది. వార్షిక ఏకీకృత పన్ను వివరాలు ఫామ్ 26ASలో ఉంటాయి.
భారీ ట్రాన్సాక్షన్స్..
పాన్ కార్డు నెంబర్ ద్వారా ఐటీ డిపార్టుమెంట్ వెబ్ సైట్‌లో ఈ స్టేట్‌మెంట్‌ను పొందవచ్చు. అంతకుముందు ఫామ్ 26ఏఏస్‌లో మూలం వద్ద పన్ను మినహాయింపు, మూలం వద్ద పన్ను వసూళ్లు, రీఫండ్స్, టీడీఎస్ డిఫాల్ట్స్ ఉండేవి. ఇప్పుడు కొత్త ఫామ్‌లో వివిధ విభాగాలాల్లో ట్రాన్సాక్షన్స్ వివరాలు ఉంటాయి. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఇవి చక్కగా ఉపయోగపడతాయని సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఆస్తి ట్రాన్సాక్షన్స్, షేర్ల ట్రాన్సాక్షన్స్ కూడా అందులో జత చేస్తున్నట్లు మే నెలలో సీబీడీటీ సవరించిన ఫామ్ 26ఏఎస్‌ను నోటిఫై చేసింది 
20వ తేదీ నుండి క్యాంపెయిన్
2018-19 ఆర్థిక సంవత్సరంలో అధిక వ్యాల్యూ ట్రాన్సాక్షన్స్‌ను నిర్వహించి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయకుండా లేదా అసంబద్దంగా పూర్తిగా చేసిన కొంతమంది ఇండివిడ్యువల్స్‌ను గుర్తించినట్లు ఐటీ శాఖ తెలిపింది. 2019-20 మదింపు సంవత్సరం కోసం ఈ ఇండివిడ్యువల్స్ తమ ఐటీ రిటర్న్స్ దాఖలుతో పాటు సవరించిన రిటర్న్స్‌ను ఈ నెల 31వ తేదీలోగా సమర్పించాలని సూచించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్న్స్ దాఖలు చేయని వారు లేదా సవరణలు అవసరమైన ట్యాక్స్ పేయర్స్ కోసం ప్రత్యేకంగా పదకొండు రోజుల పాటు ఓ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇది 20వ తేదీ నుండి ప్రారంభమవుతుందని తెలిపింది.
ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్
ఈ క్యాంపెయిన్ ద్వారా వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా గుర్తించిన ట్యాక్స్‌పేయర్స్‌కు ఈ-మెయిల్/ఎస్సెమ్మెస్‌లు పంపిస్తామని ఐటీ శాఖ తెలిపింది. హైవ్యాల్యూ కలిగిన ట్రాన్సాక్షన్స్‌ను ఆర్థిక వివరాల స్టేట్‌మెంట్, మూలం వద్ద పన్ను చెల్లింపు, మూలం వద్ద పన్ను వసూళ్లు, విదేశీ రెమిటెన్స్ (ఫామ్ 15CC) ద్వారా గుర్తించినట్లు తెలిపింది. అంతేకాకుండా జీఎస్టీ, ఎగుమతి, దిగుమతులు, సెక్యూరిటీస్, డెరివేటివ్స్, కమోడిటీ, మ్యూచువల్ ఫండ్స్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్లు తెలిపింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The new rule of IT returns is to calculate huge transactions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0