unlock-3: What is allowed in unlock 3? What not to give?
Unlock-3 : అన్‌లాక్ 3లో వేటికి అనుమతి ఇస్తారు? వేటికి ఇవ్వరు?
Unlock-3 Guidelines : జులై 31తో అన్‌లాక్-2 ముగుస్తుంది. మరి అన్‌లాక్-3కీ, 2కీ తేడా ఏముంటుంది? అన్న అంశంపై కేంద్రం బాగా చర్చిస్తోంది. కొన్ని మార్పులు ఉండబోతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్-3 ఎలా ఉండాలి, వేటికి అనుమతి ఇవ్వాలనే అంశంపై లోతుగా కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఆల్రెడీ గైడ్‌లైన్స్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఐతే... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా రాష్ట్రాల్లో కరోనా కట్టడికి ఏం చేస్తున్నారు? మినహాయింపులపై రాష్ట్రాల సీఎంల అభిప్రాయమేంటి? అన్‌లాక్-3 ఎలా ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారు? వంటి అంశాలపై చర్చించనున్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.
అన్‌లాక్-1 కంటే 2లో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడైతే దేశంలో రోజూ దాదాపు 50వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా రోజూ 500 నుంచి 700 దాకా వస్తున్నాయి. అయినప్పటికీ... అన్‌లాక్-3లో కొన్ని మినహాయింపులు ఇచ్చే ఉద్దేశంతో కేంద్రం ఉన్నట్లు తెలిసింది.
ప్రస్తుతం దేశంలో అన్‌లాక్-2 ఉన్నా లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, సినిమా షూటింగ్స్ తప్ప మిగతా అన్నీ తెరచుకుంటున్నాయి, పనిచేస్తున్నాయి. అందువల్ల ప్రజలు తాము లాక్‌డౌన్‌లో ఉన్నట్లు భావించట్లేదు. సినిమాలను OTTలో చూస్తున్నారు. విద్యకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఆన్‌లైన్ క్లాసులు అనధికారికంగా నడుస్తున్నాయి. అందువల్ల దాదాపు కండీషన్లేవీ లేనట్లే పరిస్థితి ఉంది.
తాజాగా ఏం తెలిసిందంటే... అన్‌లాక్-3లో స్కూళ్లను యధావిధిగా మూసి ఉంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే మెట్రో రైళ్లు, సర్వీసులు కూడా అలాగే ఉండనున్నట్లు సమాచారం. వాటికి సంబంధించి కచ్చితమైన ప్రమాణాల్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది.
సినిమా హాళ్లను మాత్రం తెరవబోతున్నట్లు తెలిసింది. కచ్చితమైన సోషల్ డిస్టాన్స్ విధానాలు పాటిస్తూ... ఎక్కువ ఏసీ లేకుండా చేస్తూ... థియేటర్లకు కేంద్రం అనుమతి ఇవ్వనున్నట్లు తెలిసింది. అదే జరిగితే... బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ... లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విడుదల వాయిదా పడుతూ వస్తున్న చాలా సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
కేంద్రం అనుమతి ఇచ్చినా... ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తాయా లేదా అన్నది తేలాల్సిన ప్రశ్న. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇప్పుడిప్పుడే కేసుల జోరు మెల్లగా తగ్గుతోంది. అందువల్ల కేంద్రం ఓకే అంటే... తెలంగాణలో అనుమతిచ్చే అవకాశాలుంటాయి. దీనిపై సోమవారం నాటి ప్రధాని-సీఎంల మీటింగ్ తర్వాత క్లారిటీ వచ్చే ఛాన్సుంది.

0 Response to "unlock-3: What is allowed in unlock 3? What not to give?"
Post a Comment