Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

We need to eat these to keep our teeth strong and healthy.

మన పళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినాలి.
We need to eat these to keep our teeth strong and healthy.
                          Kale
మనం రోజూ ఎన్నో తింటూఉంటాం, తాగుతూంటాం.అలా వాటిలో మన పళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉండటానికి ఏవి తోడ్పడుతాయో ఇక్కడ చూద్దాం.

మన పళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా కావాల్సింది calcium,protein , fiber పుష్కలంగా దొరికే ఆహారపదార్థాలు.అవి వేటిలో దొరుకుతాయో చూద్దాం.ఇక్కడ చెప్పిన 8 తప్పకుండా ఏదో ఒక రూపంలో తినేట్టు చూసుకోవాలి.
గ్రీన్ టీ, బ్లాక్ టీ:- పొద్దున లేవంగానే మనలో చాలామందికి టీ లేకపోతే తోచదు.ఈ మధ్య కాలంలో చాలా మంది గ్రీన్ టీ, బ్లాక్ టీ లకు బాగా అలవాటు పడ్డారు. ఇవి మన శరీరాన్ని ఉత్తేజపరచడమే కాకుండా మన పళ్ళ మధ్య వచ్చే క్యావిటీస్,గం డిసీసస్ కి సంబంధించిన బ్యాక్టేరియ పెరగకుండా చేస్తాయి.
We need to eat these to keep our teeth strong and healthy.

బాదాం:- బాదాంలో క్యాల్షియం,ప్రొటీన్స్ సమృద్ధిగా ఉంటుంది.మన పళ్ళను బలంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రోజు బాదాం తినడం మంచిది.దానికితోడు వీటిలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది.
ఎండుద్రాక్ష:- ఎండుద్రాక్ష తీయ్యగా ఉంటుంది.కానీ మనం తీసుకొనే మామూలు తెల్ల చక్కెర ఉండదు.తెల్ల చక్కెర అయెతే పళ్ళలో బ్యాక్టీరియ ఉండిపోయేట్టు చేస్తుంది. కానీ ఎండుద్రాక్షలో ఉన్న ఫోటోకెమికల్స్ క్యావిటికి కారణమయ్యే plaque బ్యాక్టీరియని చంపేస్తుంది.
చీస్:- ఇందులో క్యాల్షియం, ప్రొటీన్ ఇతర పోషకాలు ఉండటం వల్ల పళ్ళ మీద బలంగా ఉండటానికి తోడ్పడుతుంది. చీస్ నమలాలంటే మన నోట్లోని లాలాజలం ఎక్కువగా కావాలి.లాలాజలం ఊరినప్పుడు, పళ్ళమధ్యలో పేర్కొనిపోయినవి బయటికి వచ్చి దంతక్షయం నుండి పళ్ళను కాపాడుకోవచ్చు.
ఆకుకూరలు:- ఆకుకూరల్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండటం, అలాగే వీటిలో క్యాలొరీస్ తక్కువగా ఉండటం వలన వీటిని మనం తినే ఆహారంలో ఏదో ఒక రూపంలో చేర్చుకోవచ్చు. పాలకూర, కాలె ఆకుకూరలు మన పళ్ళ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. భ్ విటమిన్ ఉండటం వల్ల gum diseases దూరం చేసుకోవచ్చు.
ఆపిల్స్:- ఆపిల్స్ లో ఫైబర్ మరియున్ నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల మన నోట్లో లాలాజలాన్ని ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుంది.ఇలా లాలాజలం మన పళ్ళ మధ్య ఉన్న బ్యాక్టీరియని, తిన్న తిండిని బయటకు పంపి పళ్ళ మధ్య శుభ్రంగా ఉంచుతాయి.
క్యారట్స్:- క్యారట్స్ లో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా లాలాజలాన్ని ఉత్పత్తి చేసి బ్యాక్టీరియని తరిమికొట్టడంలో తోడ్పడుతుంది.
We need to eat these to keep our teeth strong and healthy.

పాలు:- పాలుతాగడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే క్యాల్షియం అందుతుంది. ఎముకలు బలంగా ఉండాలన్నా మన పళ్ళు బలంగా ఉండాలన్నా పాలు అవసరం.

ఫైబర్, క్యాల్షియం,ప్రొటీన్స్ ఉన్నవి ఎన్ని తీసుకున్న అన్నిటికన్నా ముఖ్యమైనది నీళ్ళు. నీళ్ళల్లో కొవ్వు పదార్థాలు ఉండవు, చక్కెర ఉండదు.Juices, sodaలు ఎన్ని తాగినా నీళ్ళ సమానం కావు. నీళ్ళను బాగా తాగాలి.నీళ్ళు బాగా తాగడం వల్ల మన అందమైన నవ్వుని ఆరోగ్యమైన నవ్వుని పదిలంగా ఉంచుకున్నట్టే!

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "We need to eat these to keep our teeth strong and healthy."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0