Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What is the situation of those who have passed 10th class.

పదవ తరగతి లో ప్రతిభ గల విద్యార్థులు,మిగతా విద్యార్థులు ఒకటేనా!
గ్రేడ్లో, మార్కులో ఇవ్వకుంటే?
పై చదువులకు, కొలువులకు కొలబద్ద ఏదీ?.. 
ప్రవేశ పరీక్షలు పెట్టుకోవాలా?
కరోనా టైంలో ఇది సాధ్యమేనా?
చట్ట సవరణ చేయకుండా ఎంట్రన్స్‌  లు జరిపేదెలా?
కేవలం పాస్‌ సర్టిఫికెట్‌తో ఒరిగేదేంటి?.. కష్టపడి చదువుకున్న వారికి అన్యాయం
మెరిట్‌ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర అసంతృప్తి

పాఠశాల విద్యలో అత్యంత కీలకమైన పదో తరగతిలో విద్యార్థుల ప్రతిభను గుర్తించకపోతే ఆయా విద్యార్థుల భవిష్యత్‌ దెబ్బ తింటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడాది పొడవునా చదివిన చదువుకు కొలమానం లేకుంటే ఇబ్బందులు తప్పవని తల్లిదండ్రులు, విద్యార్థులు కలవరపడుతున్నారు. 2019-20 విద్యా సంవత్సరపు పదో తరగతి విద్యార్థులందరినీ పాస్‌ చేయాలని.. వారికి గ్రేడ్లు గానీ మార్కులు గానీ ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించడంపై... కష్టపడి చదివి మెరిట్‌తో ఫలితం సాధించాలని భావించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సర్టిఫికెట్‌లో విద్యార్థులందరికీ కామన్‌గా ‘పాస్‌’ అని ఇవ్వడం  వల్ల ఉపయోగమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గ్రేడ్లు, మార్కులు ఇవ్వకుండా అందరూ ఉత్తీర్ణత సాధించారని ప్రకటిస్తే.. అత్యంత ప్రతిభ కలిగిన విద్యార్థులను, అత్తెసరి పాస్‌ మార్కులు పొందే వారికి, ఫెయిలయ్యే వారికి తేడా ఏమి ఉటుందని ధ్వజమెత్తుతున్నారు. ఇప్పుడు ఇచ్చే సర్టిఫికెట్‌తో పై చదువుకు, కొలువులకు కొలబద్ద ఏమిటన్న ప్రశ్నలు ఉత్ఫన్నమవుతున్నాయి.

అంతర్గత పరీక్షల మార్కుల రద్దుతో..

పదో తరగతి విద్యార్థులకు గత విద్యా సంవత్సరంలో నాలుగు ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌ (ఎఫ్‌ఏ), ఒక సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌ (ఎస్‌ఏ) పరీక్షలు నిర్వహించారు. ఒక్కో ఎఫ్‌ఏ 25 మార్కుల చొప్పున నాలుగు ఎఫ్‌ఏలను మొత్తం 100 మార్కులకు నిర్వహించారు. ఎస్‌ఏ-1ను 100 మార్కులకు నిర్వహించారు. సాధారణంగా సమ్మేటివ్‌ పరీక్షలు పూర్తయిన వెంటనే ఆయా విద్యార్థులు పొందిన మార్కులను అప్‌లోడ్‌ చేయాలి. కానీ గత ఏడాది పదో తరగతిలో అంతర్గత పరీక్షల మార్కులను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించడంతో.. ఇక వాటి అవసరం ఏముందిలే అన్నట్లు దాదాపు 15 శాతం పాఠశాలలు తమ విద్యార్థులకు సంబంధించిన సమ్మేటివ్‌ పరీక్షల మార్కులను పాఠశాల విద్యాశాఖకు పంపించలేదు. కానీ కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసి అందరినీ పాస్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత.. టీచర్లు అందరూ స్కూళ్లకు వెళ్లి పెండింగ్‌లో ఉన్న సమ్మేటివ్‌ పరీక్షల మార్కులను తక్షణమే తమకు అప్‌లోడ్‌ చేయాలని విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలో కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. అంతర్గత పరీక్షల్లో అంటే ఎఫ్‌ఏ పరీక్షలలో విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చింది. దీంతో ఇబ్బందులు రాలేదు.

ఎంట్రన్స్‌ టెస్టులు నిర్వహించుకోవాలా?

కరోనా కారణంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా.. పై తరగతుల్లో ప్రవేశాలకు ఆయా సంస్థలు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నిర్వహించుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొనడం అర్థరహితమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో అసలు ఎంట్రెన్స్‌ టెస్ట్‌లు ఎలా నిర్వహిస్తారు? జూనియర్‌ కాలేజీల్లో చేరే వారందరికీ మళ్లీ ఎంట్రెన్స్‌ నిర్వహిస్తారా?  కండక్టర్‌ కొలువులకు రాష్ట్ర రవాణ సంస్థలు కూడా టెన్త్‌ మార్కులను లేదా గ్రేడ్లను ప్రాతిపదికగా తీసుకుంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుంటే భవిష్యత్‌లో పాస్‌ సర్టిఫికెట్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What is the situation of those who have passed 10th class."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0