Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Which corona? Which seasonal?

ఏది కరోనా ? ఏది సీజనల్ ? 
రోగమేదో తెలియక ప్రజల అవస్థలు జ్వరం , తుమ్ము , దగ్గు వస్తే వెన్నులో వణుకు 
లక్షణాల ఆధారంగా అంచనా వేయవచ్చు : నిపుణులు
Which corona? Which seasonal?

ఇది కరోనా కాలం .. వర్షాకాలం కూడానూ .. దగ్గినా , తుమ్మినా .. జ్వరం వచ్చినా , జలుబు వచ్చినా .. వామ్మో ! ఇది కరోనా కావచ్చు ; సీజనల్ కదా అందుకే ఇలా కావచ్చు . ప్రజలను ఆగం పట్టిస్తున్న అనుమానాలివీ . ఏది కరోనానో , ఏది సీజ నల్ వ్యాధి అన్నది తెలియక తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు . చిన్నపాటి దగ్గు వచ్చినా గుండెల్లో కరోనా దడ పుడుతు న్నది . జ్వరం వస్తే ముచ్చెమటలు పడుతు న్నాయి . ఒంటి నొప్పులు , తలనొప్పి వస్తే భయం వెంటాడుతున్నది . ప్రస్తుతం వాన కాలం కొనసాగుతున్నది . ఈ కాలంలో దోమల బెడద ఎక్కువే . వర్షాలతో సాధార ణంగా సీజనల్ వ్యాధులు అంటే జలుబు , వైరల్ ఫీవర్ , దగ్గు , డెంగీ తదితర వ్యాధులు ప్రబలడం సహజం . అయితే , కరోనా విజృంభిస్తున్న ఈ వేళ .. సీజనల్ వ్యాధుల లక్షణాలు , కరోనా లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉండడంతో జనం గజ గజ వణికిపోతున్నారు . ఈ రెండింటిని వేరు చేసి చూడటం అంత సులువు కాదని వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నారు . సీజు నల్ గా భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ముంచుకొస్తుందని , అలాగని చిన్నపాటి జ్వరం , దగ్గును కరోనాగా భావించి ఆందో ళనకు గురికావల్సిన అవసరం లేదని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు . కొన్ని లక్షణాలతో కరోనానా ? సీజనలా ? అన్నది తెలుసుకోవ చ్చని వెల్లడించారు . లక్షణాలు ఏవైనా .. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కలిస్తే కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ . ఇలాంటి వాళ్లు పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ శంకర్ సూచించారు . ఇండ్లలోనే ఉండే వాళ్లు తమకు ఉన్న లక్షణాలను క్షుణ్నంగా పరీక్షించుకోవాలని , సీజనల్ లేదా సాధా రణ జ్వరం , దగ్గు , జలుబు ఉంటే మూడు రోజుల్లో తగ్గుతుందని వెల్లడించారు . అలా తగ్గకుంటే కరోనా పరీక్షలు చేయించుకోవా లని తెలిపారు . గుండె , కిడ్నీ , క్యాన్సర్ , హెచ్ఐవీ , బీపీ , షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించాలన్నారు .
కరోనా లక్షణాలు

  • తీవ్ర జ్వరం మూడు రోజులైనా తగ్గదు 
  • జలుబు ఉన్నా ముక్కు కారదు .
  • పొడి దగ్గు వస్తుంది 
  • రుచి , వాసన తెలియదు 
  • ఒంటినొప్పులు తీవ్రంగా ఉంటాయి 
  • తలనొప్పి తీవ్రంగా ఉంటుంది 
  • గొంతునొప్పి ఉంటుంది
  • ఛాతిలో నొప్పి వస్తుంది 
  • కండ్లు ఎర్రబడతాయి 
  • వాంతులు , విరేచనాలు ఉంటాయి

 సీజనల్ లక్షణాలు

  • సాధారణ జ్వరం మూడు రోజుల్లో తగ్గుతుంది 
  • ముక్కు కారుతుంది 
  • కఫంతో కూడిన దగ్గు వస్తుంది 
  • రుచి , వాసన తెలుస్తుంది సాధారణంగా ఉంటాయి 
  • గొంతునొప్పి ఉంటుంది 
  • ఛాతి నొప్పి ఉండదు 
  • కండ్లు ఎర్రబడవు 
  • వాంతులు , విరేచనాలు ఉంటాయి




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Which corona? Which seasonal?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0