Will the Prime Minister hold a video conference with the Chief Ministers again? Locked down?
మళ్ళీ ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫిరెన్సు ఆన్ లాకెనా? లాక్ డౌన?
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్దమయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ... ప్రస్తుతం దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఈ నెల 27వ తేదీన ఈ సమావేశం ఉంటుందని చెబుతున్నాయి అధికారిక వర్గాలు. కరోనా కేసుల తీవ్రత పెరుగుతోన్న క్రమంగా లాక్‌డౌన్‌కు వీడ్కోలుపలికి.. అన్‌లాక్‌కు వెళ్లిపోయింది ప్రభుత్వం.. అన్‌లాక్ 2.0గా కూడా దగ్గరపడుతోంది.. ఈ నేపథ్యంలో.. అన్‌లాక్ 3.0పై కూలంకశంగా చర్చించనున్నారు అని తెలుస్తోంది.
కరోనా తీవ్రత, లాక్‌డౌన్ మొదలవగానే ప్రధాని నరేంద్ర మోడీ మార్చి నెలలో మొట్ట మొదటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక, తాజాగా ఈ నెల 16,17 తేదీల్లో అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కాన్ఫరెన్స్‌లో కరోనా తీవ్రత, ఆయా రాష్ట్రాలు చేపడుతున్న చర్యలతో పాటు లాక్‌డౌన్ సడలింపుల తర్వాత పరిస్థితులపై ఆరా తీశారు ప్రధాని.. అయితే.. అప్పటికీ.. ఇప్పటికీ పరిస్థితి చాలా మారిపోయింది..
ఒక్కో రోజు కొత్త రికార్డు తరహాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఇక, నిన్న ఒకే రోజు 49 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం.. ఈ నేపథ్యంలో జరగనున్న సీఎంల వీడియో కాన్ఫరెన్స్‌లో.. సీఎంలు ఏం చెప్పబోతున్నారు.. ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఉత్కంఠ నెలకొంది.
0 Response to "Will the Prime Minister hold a video conference with the Chief Ministers again? Locked down?"
Post a Comment