A good policy in lIC is money once a month with a premium
LIC లో ఒక మంచి పాలసి ఒక్కసారి ప్రీమియంతో ప్రతినెలా డబ్బులు.
దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినా కూడా ఎల్‌ఐసీపై ప్రజల్లో విశ్వాసం చెక్కుచెదరలేదు. ఎల్‌ఐసీ ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. వీటిల్లో జీవన్ శాంతి ప్లాన్ గురించి ఇప్పుడు తెలుకుందాం. ఎల్‌ఐసీ జీవన్ శాంతి పాలసీ ద్వారా తీసుకోవడం ఆర్థిక భద్రత పొందొచ్చు. ఒక్కసారి ప్రీమియం చెల్లించి ప్రతి ఏడాదిపెన్షన్ తీసుకుంటూ ఉండొచ్చు. ఉదాహరణకు 50 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ పాలసీలో రూ.10.18 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. రూ.65,600 వార్షిక పెన్షన్ పొందొచ్చు. ఇది నాన్ లింక్డ్ ప్లాన్. ఒకేసారి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
తర్వాత వెంటనే పెన్షన్ పొందొచ్చు. లేదంటే కొంత కాలం తర్వాతి నుంచి కూడా పెన్షన్ తీసుకోవచ్చు. పలు రకాల యాన్యుటీ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ పాలసీని ఆఫ్‌లైన్‌లో ఎల్‌ఐసీ ఏజెంట్ల ద్వారా కానీ లేదంటే ఆన్‌లైన్‌లో ఎల్ఐసీ వెబ్‌సైట్ ద్వారా కానీ కొనుగోలు చేయొచ్చు.
ఈ ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవడం వల్ల లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది. అలాగే పాలసీ నచ్చకపోతే 3 నెలల తర్వాత సరెండర్ వ్యాల్యూ పొందొచ్చు. ఆదాయపు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అందువల్ల ఎవరైనా పాలసీ తీసుకోవాలని భావిస్తే..
ఈ పాలసీని పరిశీలించొచ్చు. 30 ఏళ్ల నుంచి 85 ఏళ్ల మధ్యలో ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న ఏడాది తర్వాతి నుంచి లోన్ ఫెసిలిటీ లభిస్తుంది. పాలసీ తీసుకున్న వెంటనే పెన్షన్ వద్దునుకుంటే..
అప్పుడు 5, 10, 15, 20 ఏళ్ల తర్వాత కూడా పెన్షన్ తీసుకోవచ్చు. ఐదేళ్ల తర్వాత అయితే రూ.91,800 వార్షిక పెన్షన్ పొందొచ్చు. 10 ఏళ్ల తర్వాత రూ.1,28,300 వార్షిక పెన్షన్ తీసుకోవచ్చు. 15 ఏళ్ల తర్వాత అయితే రూ.1,69,500 వార్షిక పెన్షన్ లభిస్తుంది. ఇక 20 ఏళ్ల తర్వాత అయితే రూ.1,92,300 వార్షిక పెన్షన్ పొందొచ్చు

0 Response to "A good policy in lIC is money once a month with a premium"
Post a Comment