AP government key decision ... Calling bell at corona patient ..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... కరోనా రోగి వద్ద కాలింగ్ బెల్..
Calling Bell Facility At Corona Patients Beds: కరోనాపై పోరులో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Calling Bell Facility At Corona Patients Beds: కరోనాపై పోరులో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల బెడ్స్ వద్ద కాలింగ్ బెల్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
- కొన్ని ఆసుపత్రుల్లో వైద్యులు తరచుగా రోగుల వద్దకు వెళ్లడం లేదన్న విమర్శలు వస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
- రోగికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కాలింగ్ బెల్ నొక్కితే.. డాక్టర్ లేదా నర్సు వచ్చి అతడి పరిస్థితిని పర్యవేక్షించాల్సి ఉంటుంది.
- రాష్ట్రంలో ఉన్న అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు వైద్యారోగ్య శాఖ సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు జారీ చేసింది.
- ఐసీయూ, నాన్ ఐసీయూ, ఆక్సిజన్, జనరల్ వార్డుల్లో ఈ బెల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇక వీటన్నింటిని రిసెప్షన్‌కు అనుసంధానం చేస్తారు.
- రోగి బజర్ నొక్కిన దగ్గర నుంచి డాక్టర్ లేదా నర్సు వచ్చేవరకూ బెల్ మోగుతూనే ఉంటుంది.
- ఇక అటు రోగులకు డాక్టర్లు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవల పరిశీలనకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది.
0 Response to "AP government key decision ... Calling bell at corona patient .."
Post a Comment