Arogyasree Health Trust Alert for Network Hospitals
ఉద్యోగుల నుంచి
చార్జీలు వసూలు చేస్తే వేటే!
నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ హెచ్చరిక
ఆరోగ్యశ్రీ సేవల పరిధిలో గుర్తింపు పొందిన నెట్‌వర్క్ ఆస్పత్రులు చికిత్సలకు సంబంధించి ఉద్యోగుల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేసినా వేటు తప్పదని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ సీఈవో హెచ్చరించారు. ఉద్యోగుల ఆరోగ్య చికిత్సలకు సంబంధించిన బిల్లుల రీయింబర్స్‌మెంట్ గడువును ఈ నెల 31వరకూ పొడిగిస్తూ ఆయన ఉత్తర్వులు జారీచేశారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల చికిత్సలకు సంబంధించి పలు మార్గదర్శకాలను ఈ ఉత్తర్వులో పొందుపరిచారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద చికిత్స పొందే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు నగదు చెల్లింపు ప్రాతిపదికన చికిత్సలు అందిస్తూ ఆస్పత్రి బిల్లులను ప్రభుత్వం నుంచి తిరిగి పొందేందుకు (రీయింబర్స్‌మెంట్) ప్రోత్సహిస్తున్నట్లు ట్రస్ట్ దృష్టికొచ్చినట్లు పేర్కొన్నారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు సంబంధించిన నియమాల విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు సీఈవో స్పష్టం చేశారు. ఉద్యోగుల నుంచి చికిత్స ఖర్చులు వసూలుచేస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు.

0 Response to "Arogyasree Health Trust Alert for Network Hospitals"
Post a Comment