Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Before the transfers, a fair of new IDs


బదిలీల ముందర కొత్త ఐడి ల జాతర
ప్రస్తుత డేటాతో తయారీకి సన్నద్ధం
జిల్లాలో 13,482 మంది టీచర్లు
వృధా కానున్న రూ.5.12 లక్షలు
Before the transfers, a fair of new IDs

విద్యా శాఖలో ఉపాధ్యాయులకు గుర్తింపు (ఐడీ) కార్డులు ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పానికి కార్యాచరణ ప్రారంభమైంది. జిల్లాలో ఎయిడెడ్, అన్  ఎయిడెడ్  పాఠశాలల టీచర్ల మినహా మిగతా అన్ని ప్రభుత్వ, జడ్పీ, మునిసిపల్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న మొత్తం 18.842 మంది ఉపాధ్యాయులకు నెల రోజుల లోగా ఐడీ కార్డులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గుర్తింపు కార్డులను రూ.37లకే తయారు చేసి మండల కేంద్రాలకు అందించేలా టెండరు ఖరారైంది. ఈ మేరకు తమ పరిధిలో పనిచేస్తున్న టీచర్ల సమగ్ర వివరాలను నిర్ణీత జాబితాలో ఉపాధ్యాయుని ఫొటోతో సహా డేటాను ఎంఈవోలకు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులకు జిల్లా అధికారులు ఆదేశించారు. ఇక హైస్కూల్ టీచర్ల వివరాలను హెచ్ఎంలు సంబంధిత డీవై ఈవోలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డేటా ఆధారంగా ప్లాస్టిక్ కార్డుల రూపంలో గుర్తింపు కార్డులను ముద్రించి సరఫరాదారు విద్యాశాఖకు అందజేసేలా ఒప్పందం ఖరా రైంది. పాఠశాలలు తెరవక ముందే టీచర్ల బదిలీలు నిర్వహించనున్నట్టు విద్యా శాఖ మంత్రి సురేశ్ కొంత కాలంగా చెబుతున్నారు. ఆ మేరకు జిల్లాలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే ఉన్నతాధికారులు సూచనలు చేశారు. టీచర్లు, హెచ్ఎంలకు దీర్ఘకాలంపాటు(లాంగ్ స్టాండింగ్ ఒకే స్కూల్ లో పనిచేస్తున్న సుమారు రెండు వేల మందికి స్థాన చలనం తప్పదు. ఇక బదిలీకి కనీస సర్వీసు రెండేళ్లు నిర్ణయించినందున మిగతా టీచర్లలో కనీసం 70 నుంచి 80 శాతం మంది దరఖాస్తు చేసుకునే వీలుంది. ఆ ప్రకారం సాధారణ బదిలీల్లో దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల మంది హెచ్ఎంలు, టీచర్లు బదిలీ అవుతారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల వివరాలు ముద్రిస్తున్న ఐడీ కార్డు సాధారణ బదిలీలు తరువాత ఎందుకు పనికిరాకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు హడావుడిగా ఐడీ కార్డులు జారీ చేసినా బదిలీ టీచర్లకు అవి నిరుపయోగమే. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లు 7209 మందికి, హైస్కూల్ టీచర్ 633 మందికి ఉపయోగపడేలా రూ 5.12 లక్షల వ్యయంతో చేపట్టిన ఐడీ కార్డుల ప్రయోజనం నూరు శాతం నెరవేరడానికి విద్యాశాఖ పునరాలోచన చేయాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Before the transfers, a fair of new IDs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0