Deposit of wages from today
నేటి నుంచి వేతనాల జమ
ఈ నెలారంభంలో తొలి రెండు రోజులు సెలవులు వచ్చాయి. కిందటి నెల బడ్జెట్ సమస్యల వల్ల రెండో వారం వరకు వేతనాలందలేదు. దీంతో ఈ నెల జీతాలు త్వరగా అందాలని ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ ప్రక్రియ వేస్ అండ్ మీన్స్‌లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జీతాలకు ఎలాంటి సమస్య లేదని, సోమవారం చెల్లింపులు ప్రారంభమవుతాయని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఆదివారం రాత్రి చెప్పారు. సెలవులు రావడం వల్లే ఒకటిన జీతాలు అందలేదని వివరించారు. జీతాలు, పింఛన్లకు కలిపి రూ.5,000 కోట్లపైనే అవసరం. బిల్లులకు సంబంధించి రిజర్వు బ్యాంకులో బ్యాచ్ నంబర్లు సిద్ధమవుతున్నందున సోమవారం వేతనాలు జమవుతాయని సీఎఫ్‌ఎంఎస్ వర్గాలు తెలిపాయి. పరిస్థితికి అనుగుణంగా చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమై క్రమేణా అందరికీ అందే అవకాశముందని సమాచారం.*
0 Response to "Deposit of wages from today"
Post a Comment