Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do not scare children on the cove Do not limit yourself to four walls

కొవిడ్‌పై పిల్లలను భయపెట్టొద్దు
నాలుగు గోడలకు పరిమితం చేయొద్దు
ఇప్పుడు బడులు తెరిచినా 95 శాతం పిల్లలను పంపరు
వెబినార్‌లో  పలువురు నిపుణుల అభిప్రాయం
Do not scare children on the cove  Do not limit yourself to four walls

‘కొవిడ్‌ వల్ల ఏదో జరిగిపోతుంది. అక్కడ అలా అయింది.. ఇలా అయింది అనే విషయాలు పిల్లలకు చెప్పి వారిలో మరింత భయం పెంచొద్దు. వారికి ధైర్యం చెప్పాలి. మానసికంగా ధృడంగా ఉండేలా చూడాలి. ఇంట్లో ఉన్నారని నిరంతరం చదువు అని ఒత్తిడి తేకుండా ఉల్లాసంగా గడిపేలా చూడాలి’ అని నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘కొవిడ్‌ కారణంగా పిల్లల్లో శారీరక, మానసిక, సామాజిక ప్రభావాలు.. పరిష్కారాలు’ అనే అంశంపై కిన్నెర మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆదివారం వెబినార్‌ నిర్వహించారు. పలువురు నిపుణులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
మానసిక ప్రభావం లేకుండా చూడాలి
కరోనాతో వాళ్లు, వీళ్లు చనిపోయారు.. తెలిసినవారికి పాజిటివ్‌ వచ్చిందని పిల్లలకు చెబితే వారిలో భయం ఏర్పడుతుంది. బయట తిరగకుండా ఉంటే మనకు రాదనే ధైర్యం వాళ్లకు ఇవ్వాలి. ఒకవేళ భయపడితే.. నీకు ఎందుకొస్తుంది అని చెప్పి, దగ్గరకు తీసుకొని ధైర్యం నింపాలి. బయటికెళ్లకుండా నాలుగు గోడల మధ్య ఉండటంతో మానసికంగా ప్రభావం ఉంటుంది. అది లేకుండా తల్లిదండ్రులు చూడాలి. ఇంట్లో ఉంటున్నారని నిరంతరం చదువు అని ఒత్తిడి తేవద్దు. అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు.. ఇలా చేయొద్దని అనకూడదు. ఇంట్లో కూడా ఆడుకునే అవకాశమివ్వాలి. పిల్లలతో కలిసి సరదాగా గడపాలి.
డాక్టర్‌ బీవీ పట్టాభిరామ్‌, మానసిక నిపుణులు

లక్షణాలు లేకుండా పరీక్షలొద్దు
పిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం వంటివి వచ్చి రెండు రోజుల్లో తగ్గిపోతే పరీక్షలు అక్కర్లేదు. మూడో రోజు కూడా ఉంటేనే దీనిపై దృష్టిపెట్టాలి. సీటీస్కాన్‌ కూడా పిల్లలందరికీ అవసరం ఉండదు. 15 శాతం మందిలోనే కరోనా ప్రభావం కనిపిస్తుంది. అతి కొద్దిమందిలో మల్టీసిస్టమ్‌ హైపర్‌ ఇన్‌ఫ్లామేటరీ సిండ్రోమ్‌కు అవకాశం ఉంటుంది. 102- 104 డిగ్రీల జ్వరం, వాంతులు, కడుపునొప్పి, విరోచనాలు కావడం, ముఖం కాళ్లు చేతులు ఉబ్బడం, కళ్లు, పెదాలు, నాలుక   ఎర్రగా మారితే అప్రమత్తమవ్వాలి. ఈ లక్షణాలుంటే వెంటనే చికిత్స అందించాలి. తలసీమియా, ల్యుకేమియా, క్యాన్సర్‌ తదితరాల జబ్బులతో బాధపడే చిన్నారులకు కొవిడ్‌ సోకినా భయపడొద్దు. జాగ్రత్తలు తీసుకుంటే చాలు.
డాక్టర్‌ సతీష్‌ ఘంటా, చిన్నపిల్లల వైద్య నిపుణులు
జాగ్రత్తలు పాటిస్తూ బయటకు తీసుకెళ్లాలి
దాదాపు ఆరు నెలలుగా పిల్లలను అపార్ట్‌మెంట్‌ కిందకో, దగ్గరలో ఉన్న పార్కుకు కూడా వెళ్లకుండా చేస్తున్నాం. ఇంట్లో నుంచి బయటకు రానివారు కూడా కొవిడ్‌ బారినపడిన కేసులు ఎన్నో ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలను కనీసం వారంలో రెండుసార్లయినా పార్కులు, ఖాళీస్థలాలకు తీసుకెళ్లాలి. ఇప్పుడు బడులు తెరిచినా 95 శాతం తల్లిదండ్రులు పిల్లలను పంపే పరిస్థితి లేదు. దసరా, దీపావళి మధ్య అంతా కుదుటపడి, బడులు తెరుచుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ తరగతులపై పిల్లల్లో ఆసక్తి ఉండటం లేదు. వీడియో రూపంలో తల్లిదండ్రులకు పంపి, వాటిని ఇంట్లో పిల్లలు చూసేలా చేస్తే మంచిది.
వాసిరెడ్డి అమర్‌నాథ్‌, విద్యావేత్త, స్లేట్‌ ద స్కూల్‌ డైరెక్టర్‌

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do not scare children on the cove Do not limit yourself to four walls"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0