Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do schools start?


స్కూల్స్ ప్రారంభం అయ్యేనా?

ఎన్నో వ్యతిరేకతల మధ్య సందేహాలు
నీట్‌, జేఈఈ నిర్వహణపై వివాదాలు
ముందుకేనంటున్న కేంద్ర ప్రభుత్వం
మద్దతిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం
విద్యాసంస్థలు తెరవకపోతే వెనుకబాటే
విద్యార్థుల నైపుణ్యంపైనా ప్రభావం
అన్‌లాక్ 4.0లో అనుమతించాలి.

కేంద్రానికి నిపుణుల సూచనలు
పరీక్షలు రాయడంతో పాటు తరగతులకు హాజరు కావడంలో నిర్దిష్ట నియమనిబంధనల్ని విధించొచ్చు. వాటిని విద్యార్థులు, విద్యాసంస్థలు విధిగా పాటించేలా ఉత్తర్వులు జారీ చేయెచ్చు. ఇప్పటికే విద్యార్థులతోపాటు పలు విద్యాసంస్థలు కూడా భవిష్యత్‌పై అభద్రతాభావంతో ఉన్నాయి.
ప్రైవేటు విద్యాసంస్థలైతే తిరిగి కోలుకోగలమా అన్న ఆందోళనకు గురౌతున్నాయి. వీటిలోని అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయి రోజువారి కూలీలుగా, కార్మికులుగా, చిల్లర వర్తకులుగా జీవితాలు గడపాల్సి వస్తోంది. అలాగే విద్యార్థులకు కూడా అంచెలంచెలుగా విద్యాభ్యాసంపై పట్టు సడలే ప్రమాదం నెలకొందని నిపుణులు కేంద్రానికి సూచిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 90కోట్ల మంది విద్యార్థులపై కోవిడ్‌ పంజా విసిరింది. వీరంతా కరోనా కారణంగా విద్యాలయా లకు నాలుగు మాసాల పాటు దూరమయ్యారు. ముఖ్యంగా పరీక్షల సమయాన్ని కోల్పోయారు. అంచెలంచెలుగా అమెరికా నుంచి అన్ని దేశాల్లోనూ తొలుత ప్రైవేటు, ఆ తర్వాత ప్రభుత్వ రంగంలోని విద్యావ్యవస్థలు పునరు ద్ధరించబడ్డాయి. పరీక్షలు పూర్తి చేసి తదుపరి తరగతుల్ని నెమ్మదిగా ప్రారంభిస్తున్నాయి. కాగా భారత్‌లో మాత్రం ఈ పరిణామం ఇంకా డైలమాలోనే ఉంది. ఇక్కడ రోజు రోజుకు పెరుగుతున్న కేసుల నేపధ్యంలో విద్యాసంస్థల పునరుద్ధర ణపై పలు సందేహాలు నెలకొన్నాయి. కొన్నివర్గాలు ఇప్పటికీ విద్యాసంస్థలపై నిషేధాజ్ఞల్ని కొనసాగించాలని కోరుతు న్నాయి. ఇప్పటికిప్పుడు పరీక్షల నిర్వహణ సరికాదని కేంద్రానికి సూచిస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం ఇప్పటికైనా పరీక్షలు నిర్వహించి కొత్త తరగతులు ప్రారంభిం చలేని పక్షంలో విద్యార్ధులు ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదముందని భావిస్తోంది. ఈ నేపధ్యంలో పోటీ పరీక్షల నిర్వహణ కు సమాయత్తమౌతోంది. సర్వోన్నత న్యాయస్థానం కూడా కేంద్ర నిర్ణయానికి మద్దతిస్తోంది. ఇప్పటికే నీట్‌, జెఇఇ 2020 ప్రవేశ పరీక్షపై ఇలాంటి వివాదాలు ముప్పిరిగొన్నాయి. కాగా ఇప్పుడు డిగ్రీ పరీక్షలపై కూడా వివాదం చెలరేగింది. పరీక్షల్లేకుండానే డిగ్రీలు జారీ చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించలేదు. సుప్రీం కూడా ఈ అంశాన్ని తప్పుబట్టింది. ఖచ్చితంగా పరీక్షల్ని నిర్వహించాల్సిందేనని సుప్రీం ఆదేశించింది.

దేశంలోని స్వయంప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థలు ఇప్పటికే తమ సొంత ప్రవేశపరీక్షల్ని నిర్వహించుకుంటున్నాయి. వీటి ద్వారా తరగతులకు విద్యార్ధుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. కాగా వివిధ ప్రభుత్వ వర్శిటీలకు అనుబంధంగా ఉన్న కళాశాలలు మాత్రం ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు నిర్వహించే ఎమ్‌సెట్‌పై కూడా తుది నిర్ణయాన్ని తీసుకోలేక పోతున్నాయి. జెఇఇ, నీట్‌ పరీక్షల్లో కొద్దిపాటి సీట్ల కోసం లక్షల సంఖ్యలో విద్యార్ధులు పోటీపడతారు. అయితే వీరిలో 80శాతానికిపైగా ఈ సీట్లు పొందే స్థాయిలో తమకు ర్యాంకులు రావని తెలుసు. అయితే పరీక్షలు రాయడంలో అనుభవం, భవిష్యత్‌లో జాతీయ స్థాయి పరీక్షల్ని ఎదుర్కొనే ఆత్మస్థైర్యం పొందేందుకు పలువురు విద్యార్ధులు ఏటా ఈ పరీక్షల్ని రాస్తున్నారు. అలాగే కొందరు కుటుంబ స భ్యుల ఒత్తిడి కారణంగా ఈ ప రీక్షలకు హాజరౌతున్నారు. నీట్‌, జెఇఇ స్థాయి పరీక్షల్ని ఎదుర్కొంటే ర్యాంకులు రాకపోయినా ఆ అనుభవం, నైపుణ్యాల్తో ఎమ్‌సెట్‌ వంటి రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్‌ పరీక్షల్ని సునాయాసంగా ఎదుర్కోగలమన్న ధీమా కోసం వీరీ పరీక్షలకు ప్రాధాన్యతిస్తున్నారు. ఈ కారణంగానే ఇన్ని వివాదాల నడుమ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసిన హాల్‌టికెట్‌లను నీట్‌, జెఇఇ విద్యార్ధులు ఇప్పటికే అత్యధిక సంఖ్యలో ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.ఇప్పటికే ప్రపంచ స్థాయివిద్యాసంస్థలన్నీ పాఠ్యాంశాల్ని ప్రారంభించాయి. ఇప్పటికైనా దేశంలో విద్యాసంస్థల పునరుద్దరణ జరగని పక్షంలో విద్యావిషయాల్లో ఓ ఏడాది ఇతర దేశాలకంటే భారత్‌ వెనుకబడే ప్రమాదం నెలకొంది. ఇది అంతర్జాతీయ స్థాయి పరీక్షలకు భవిష్యత్‌లో హాజరుకాబోయే విద్యార్థుల నైపుణ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Do schools start?"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0