Does sitting for a long time make you obese? If you mix it with water and drink it, your stomach will be eaten !.
ఎక్కువసేపు కూర్చుంటే బొజ్జ వస్తుందా? నీటిలో ఇది కలుపుకొని తాగితే పొట్ట మాయం !
చేయవలసిన పనుల
ఈ రోజుల్లో స్లిమ్‌గా ఉన్నా కూడా బొజ్జ వస్తుంది. కారణం ఎక్కువసేపు కూర్చోవడమే. అలా కూర్చోకుండా ఉందామంటే కుదరదు. రోజులు గడవాలంటే ఉద్యోగం చేయాల్సిందే. మరి పొట్ట పెరగకుండా కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే ప్రతిరోజూ నీటిలో వాము లేదా వోమ కలుపుకొని తాగాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు.. మరికొన్ని పనులు చేసినా కూడా పొట్ట తగ్గుతుంది. అవేంటంటే..
- బొజ్జ వస్తుందని ప్రతిఒక్కరూ డైట్ ఫాలో అవుతున్నారు.
- వారి డైట్‌లో వాము తప్పనిసరిగా ఉండాలి. ఉదయాన్నే లీటరు నీటిలో టీస్పూన్ వాము వేసి బాగా మరిగించాలి.
- ఈ నీరు చల్లారిన తర్వాత రోజంతా కొంచెం కొంచెంగా తాగుతూ ఉండాలి.
- తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి వాము ఎంతో ఉపయోగపడుతుంది.
- అలాగే బరువు త్వరగా తగ్గుతారు. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా వేగంగా తగ్గుతుంది.
- వాము ఒక్కటే కాదు సబ్జా గింజలు కూడా అంతే బాగా పనిచేస్తాయి. ఇందులో విటమిన్ ఏ, ఈ, కే, బీ లు పుష్కలంగా ఉంటాయి.
- సబ్జా గింజల్లో ఉండే క్యాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, కాపర్, ఫైబర్ వంటి పోషకాలు శరీరానికి పోషణ అందేలా చేస్తాయి.
- ఈ పోషకాలన్నీ బరువు తగ్గించడానికి ఉపయోగపడుతాయి.
- రోజూ అన్నమే కాకుండా వారానికి మూడు రోజులు గోధుమరవ్వను ఆహారంలో చేర్చుకుంటే శరీరంలోని కొవ్వును కరిగించుకోవచ్చు.
- శరీరానికి చల్లదనాన్నిచ్చే పెసర్లు బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతాయి. ఇవి బాడీలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహకరిస్తాయి.
- ప్రతిరోజూ ఒక కప్పు పెసర్లను ఉడకబెట్టుకొని తింటే చాలామంచిది. లేదంటే వాటిని మొలకెత్తించుకొని తింటే ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది.
0 Response to "Does sitting for a long time make you obese? If you mix it with water and drink it, your stomach will be eaten !."
Post a Comment