Good news for those who use Google Pay and Phone Pay
గూగుల్ పే, ఫోన్ పే వాడే వారికి శుభవార్త
మీరు గూగుల్ పే, ఫోన్ పే ను నిత్యం వాడుతున్నారా? అయితే మీకు శుభవార్త. గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు త్వరలో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)తో ఈ కంపెనీలు రికరింగ్ పేమెంట్ మ్యాండేట్స్ అంశంపై ప్రస్తుతం చర్చిస్తున్నాయి. ఎన్‌పీసీఐతో ఈ కంపెనీల చర్చలు సఫలం అయితే యూజర్లకు ప్రయోజనం కలుగనుంది. తద్వారా ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు ఆటో డెబిట్ సదుపాయాన్ని పొందే అవకాశం ఉంటుంది.
ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే నెలవారీ బిల్లులను సులభంగా చెల్లించొచ్చు. కరెంటు బిల్లు, మొబైల్ ఫోన్ బిల్లు, ఈఎంఐలు, మీడియా సబ్‌స్క్రిప్షన్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం ఇలా ఎన్నో రకాల చెల్లింపులు ఆటోమేటిక్ గా చెల్లించవచ్చు.
వాటి చెల్లింపులకు చివరి తేదీ ఎప్పుడు, ఎలా చెల్లించాలి తదితర విషయాల గురించి ఇక ఆలోచించాల్సిన పని ఉండదు. దాదాపు నెల రోజుల్లోనే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయా కంపెనీల వర్గాల ద్వారా తెలుస్తోంది.

0 Response to "Good news for those who use Google Pay and Phone Pay"
Post a Comment